Prema Entha Madhuram October 30 Episode 1086: అను వాళ్ళ ఇంటి దగ్గర ముత్తైదువులు అందరూ వచ్చి పూజకు సిద్ధం చేస్తూ ఉంటారు. ఆకాంక్ష పూజ కోసం అని పువ్వులు తెచ్చి అక్కడ పెట్టి ఆంటీ నీకేం కావాలన్నా అమ్మమ్మల్ని అడగండి చేసి పెడతాము అని అంటుంది. అవునక్కా అను ప్రతి సంవత్సరం ఈ కుంకుమ పూజ ఎందుకు చేస్తుంది అn ఆ ముత్తైదులో ఒక ఆవిడ అంటుంది. ఎందుకంటే కుంకుమ పూజ చేస్తే భర్తకి శుభం కలిగి ఆయురారోగ్యాలతో ఉంటాడని చేస్తారు అని ఆ ముత్తైదువుల్లో ఇంకొక ఆవిడ అంటుంది. అదేంటి అక్క అనురాధ ఎప్పుడొ వాళ్ళ ఆయనతో విడిపోయింది కదా అని ఆవిడ అంటుంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలియదా భర్తతో దూరంగా ఉన్నంత మాత్రాన ప్రేమ ఉండదా ఏ కారణం వల్ల వాళ్ళిద్దరు విడిపోయారో తెలియదు కానీ అనురాధకి మాత్రం తన భర్త అంటే ఎంతో ఇష్టం అందుకే ఆయన క్షేమం కోసం ప్రతి ఏటా కుంకుమ పూజ చేస్తుంది అని ముత్తయిదు అంటుంది.

అను రెడీ అవుతూ ఉండగా పిల్లలు వచ్చి అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు నీకు దిష్టి తగులుతుందేమో అని ఆకాంక్ష తన కళ్లకున్న కాటుక తీసి వల్ల అమ్మకి దిష్టి చుక్క పెడుతుంది. అను ముత్తైదుల దగ్గరికి వచ్చి ఆంటీ అన్ని సిద్ధమైనట్టేనా ఇక పూజ మొదలు పెడదామా అని అంటుంది. అన్ని సిద్ధమయ్యాయి అనురాధ ఇలి ల్లు తిరిగి పసుపు కుంకుమ బిక్షగా తెచ్చావు కదా అది తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టు పూజ మొదలు పెడదాము అని ముత్తయిదు అంటుంది. అలాగే ఆంటీ అని ఆ పసుపు కుంకుమ తెచ్చి పసుపు గౌరమ్మను తయారు చేస్తుంది అను. కట్ చేస్తే ఇక్కడ ఆర్య వర్ధన్ ఆటో పిలుచుకు వచ్చి వంటకాలన్నీ అందులో ఎక్కిస్తూ ఉంటాడు. ఆటో అతను చూసి గుర్తుపట్టి సార్ మీరు ఆర్య వర్ధన్ కదా మీరేంటి సార్ ఎక్కడున్నారు అని అంటాడు.పక్కనే ఉషా ఉంటుంది.

అదేంటి మా అన్నయ్య ను ఎక్కడ చూసావు ఇంతకుముందే మా అన్నయ్య మీకు తెలుసా అని ఉషా అంటుంది. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో ఏమో నేను మొన్ననే వచ్చాను 20 రోజులు అవుతుంది నన్ను మీరు ఎక్కడ చూశారండి అని ఆటో అతనికి ఆర్య వర్ధన్ సైగ చేస్తాడు. తన సైగలు గమనించిన ఆటో అతను మీ అన్నయ్య పెద్ద ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిలా ఉన్నాడమ్మా ఆ సార్ వల్లే మా ఆటో యూనియన్ అంతా చక్కగా పనులు చేసుకుని ఆటోలు కొనుక్కొని కుటుంబాలతో సంతోషంగా ఉంటున్నాము అతను లాగే మీ అన్నయ్య కనిపిస్తే అలా అన్నాను ఆ సార్ కి ఎప్పటికీ రుణం తీర్చుకోలేనమ్మ అని ఆటో అతను అంటాడు. సరే సరే ఉష సామాన్లన్నీ లోపల పెట్టు అని ఆర్య వర్ధన్ అంటాడు. ఇంతలో సుగుణ వచ్చి నాన్న సూర్య సామాన్లని ఆటోలో పెట్టుకునే నువ్వు ఒక్కడివి వచ్చేయి ఆటోలో అందరం పట్టాం కదా నేనే ఉషా నడుచుకుంటూ వస్తాము పక్క వీధిలోనే కదా అను వల్ల ఇల్లు అని అంటుంది సుగుణ. అలాగే అమ్మ అని ఆర్య అంటాడు.

దివ్య నువ్వు కూడా త్వరగా రా వెళ్దాము అని సుగుణ అంటుంది. అమ్మ నా ఫ్రెండు ఆఫీసు లేదు డ్యూటీ ఉందని చెప్పింది తనను కలిసి అక్కడి నుంచి డైరెక్ట్ గా వస్తాను మీరు వెళ్ళండి అని దివ్య వెళ్ళిపోతుంది. కట్ చేస్తే దివ్య ఫ్రెండ్ అని అబద్ధం చెప్పి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళుతుంది. ఏంటి దివ్య ఇంత లేటుగా వచ్చావు మొహానికి ఆ ముసుగు ఏంటి అని అతను అంటాడు. ఇక్కడ మా అమ్మకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనల్ని చూస్తే మా అమ్మ ఊరుకుంటుందా ఇక నా పెళ్లి చేసేస్తుంది అని దివ్య అంటుంది.మనకు కూడా కావాల్సింది అదే కదా దివ్య అని అతను నవ్వుతాడు. మా అన్నయ్య వచ్చిన కానుంచి మా అమ్మ నా పెళ్లి గురించే మాట్లాడుతుంది నువ్వు త్వరగా సెటిల్ అయితే మన గురించి అన్నయ్య వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకుందాం అని దివ్య వెళ్ళిపోతుంది. దివ్య ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావేంటి కాసేపు బైక్ మీద షికారు చేద్దాము అని అతను అంటాడు.

ఏవైనా పెళ్లి అయిన తర్వాతనే ఇప్పుడేమీ లేవు అనుకుంటూ దివ్య వెళ్ళిపోతుంది.కట్ చేస్తే మానస శర్మ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో కనుక్కో రిజిస్టర్ పేపర్లు తీసుకొని రమ్మను అని ఛాయా అంటుంది. మానస శర్మ కి ఫోన్ చేసి డాక్యుమెంట్స్ రెడీ అయ్యాయా అని అంటుంది. రెడీ అయ్యాయి మేడం నేను సార్ తో కూడా మాట్లాడాను మీరు సుగుణని తీసుకొని వస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని శర్మ అంటాడు. ఈరోజు ఎలాగైనా సుగుణను తీసుకొని వస్తాను రిజిస్ట్రేషన్ అయిపోవాలి అని జలంధర్ అంటాడు . అలాగే సార్ మీరు రావడమే లేటు అని శర్మ అంటాడు. అన్నయ్య ఆర్య వర్ధన్ని మనం రెండు విధాలుగా దెబ్బతీయచ్చు అన్నయ్య ఒకటి సుగుణ కొడుకుగా వచ్చాడు కాబట్టి నిజం చెప్పి అక్కడ నుంచి వెళ్ళగొట్టొచ్చు రెండోది ఆర్య వర్ధన్ వెళ్ళిపోతే సుగుణన ని బెదిరించి సంతకం పెట్టించుకోవచ్చు ఎటు నుంచి చూసిన సైట్ మనకు వచ్చేస్తుంది అన్నయ్య అని ఛాయా అంటుంది. కట్ చేస్తే సుగుణ అను వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది.

సార్ మీరేంటి సార్ ఇలా ఈ వేషంలో అని ఆటో అతను అంటాడు.ఏం చేస్తాం అప్పుడప్పుడు ఇలా చేయాల్సి వస్తుంది కాలం అనుకూలించనప్పుడు అని ఆర్య అంటాడు. ఆర్య సామాన్లను తీసుకొని అను వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇదేంటి ఈ ఇల్లు ఆకాంక్ష వాళ్ళ ఇల్లు లా ఉందే అంటే అమ్మను కాపాడింది రాదన అంటే ఇక్కడ ఆకాంక్ష అభయ్ కూడా ఉంటారు కాబట్టి వాళ్లకి కనిపించకుండా మేనేజ్ చేయాలి అని ఆర్య అనుకుంటాడు.అన్నయ్య పూజ మొదలైపోయింది సామాన్లన్నీ త్వరగా అక్కడ పెడదాం రా అన్నయ్య అని ఉషా అంటుంది. నేను వస్తానులే గాని నువ్వు పదమ్మ అని ఆర్య అంటాడు.అను పూజ మొదలు పెట్టే ముందు కంకణం కట్టుకోవాలి కదా ఆ కంకణం నువ్వు కట్టుకురా పిన్ని అనే ఆ ముత్తైదులో ఒక ఆవిడ అంటుంది.

నేను కట్టుకోస్తాను నువ్వు పూజ మొదలు పెట్టు అని ముతైదులో ఇంకో కావి డ వెళ్ళిపోతుంది. సామాన్లు బయట పెడుతూ చూసుకోకుండా ఆవిడకి తగులుతాడు అయ్యో చూసుకోలేదమ్మా క్షమించండి అని ఆర్య అంటాడు. అయ్యో పర్వాలేదులే బాబు నేనే చూసుకోలేదు నాకు కళ్లద్దాలు లేవు కొంచెం ఈ కంకణం కట్టి పెడతావా బాబు అని ఆవిడ అంటుంది. అలాగే అమ్మ కట్టి పెడతాను అని ఆర్య కంకణం కడతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది