NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 21 2023 Episode 1131: సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటికి వెళ్లిన పిల్లలకి ఆర్య వర్ధనే వాళ్ల తండ్రి అని తెలుస్తుందా లేదా..

Prema Entha Madhuram Today Episode December 21 2023 Episode 1131 Highlights

Prema Entha Madhuram December 21 2023 Episode 1131: పిల్లలకి ఫోటోలు చూపిస్తూ ఇది మా అమ్మాయి చిన్నప్పటి ఫోటో అని చెప్తుంది పద్మావతి. అలా ఫోటోలన్నీ చూపిస్తూ ఉండగా ఆర్య చిన్నప్పుడు ఫోటో కనపడుతుంది. ఈ ఫోటో ఎవరిది అని పిల్లలు అడుగుతారు. అది మా అల్లుడుగారు చిన్నప్పటి ఫోటో అమ్మ అని సుబ్రహ్మణ్యం అంటాడు.ఇది మా అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు దించిన ఫోటో అని చెప్తుంది అను వల్ల అమ్మ. మరి మీ అమ్మాయి పెళ్లి ఫోటోలు లేవా అమ్మమ్మ అని ఆకాంక్ష అడుగుతుంది. ఉన్నాయి తొందరపడకండి చూపెడతాను అంటూ పెళ్లి ఫోటోలు చూపెడుతుంది. ఆర్య వర్ధన్ అను పెళ్లి ఫోటోలు చూసి పిల్లలు ఇద్దరు షాక్ అయిపోతారు. ఆ ఫోటో మీద చేయి పెట్టి బాధపడుతూ ఉంటారు పిల్లలు. ఆయనే అల్లుడు మా అమ్మాయి మా అల్లుడు దేవుడు లాంటివాడు అంత గొప్ప అల్లుడు దొరకడం మా అదృష్టం అని సుబ్బు అంటాడు. మా అల్లుడు పెద్ద బిజినెస్ మాన్ అమ్మ మా అల్లుడు పేరు ఆర్య వర్ధన్ ఆయన చాలా గొప్పవాడు అని సుబ్రహ్మణ్యం చెప్తాడు.

Prema Entha Madhuram Today Episode December 21 2023 Episode 1131 Highlights
Prema Entha Madhuram Today Episode December 21 2023 Episode 1131 Highlights

మా అమ్మాయికి మా అల్లుడు దొరకడం చాలా అదృష్టం అమ్మ అంత మంచి వ్యక్తి మా అల్లుడిని మించిన మంచి మనిషి ఇంకా ఎవరూ కనిపించరు మీలాగే అతను కూడా అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు అని సుబ్రహ్మణ్యం అంటాడు. అంత మంచి వాడని మీరు చెప్తున్నారు మరి మీ అమ్మాయి ఎందుకు విడిపోయిందండి అని ఆకాంక్ష అంటుంది. మా అమ్మాయి మా అల్లుడు విడిపోవడానికి ఏ తప్పు లేదమ్మా వాళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు మంచితనమే ఒక్కోసారి శాపంగా మారి ఇబ్బంది పెడుతుంది అలాగే వాళ్లు కూడా పరిస్థితులు వల్ల విడిపోయారు మా అల్లుడు చాలా మంచివాడు అమ్మా అని సుబ్రహ్మణ్యం అంటాడు. అలాంటప్పుడు మీరే మీ అమ్మాయిని మీ అల్లుడు నీ కలపొచ్చు కదా అని ఆకాంక్ష అంటుంది. కలపాలని ప్రయత్నించామమ్మ అందుకే ఈ మాల వేసుకున్నాను సుబ్రహ్మణ్యం పుణ్యమా అని మా అమ్మాయి మా అల్లుడు ఒకటే పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని నా కోరిక అని సుబ్రహ్మణ్యం అంటాడు. మా అల్లుడు మా అమ్మాయి కలిసి ఉంటే నీలాంటి పిల్లలతో మా ఇల్లు కలకలలాడుతూ ఉండేది అని పద్మావతి ఏడుస్తుంది. ఆకాంక్ష లేచి వచ్చి పద్మావతి కన్నీళ్లు తుడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావ్ అమ్మమ్మ నేనున్నాను కదా నీకు అని అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 21 2023 Episode 1131 Highlights
Prema Entha Madhuram Today Episode December 21 2023 Episode 1131 Highlights

అక్కి అలా అనగానే తనను పట్టుకొని బోరుమని ఏడుస్తుంది పద్మావతి.  మీ అమ్మాయి కూడా మా అమ్మలాగే ఉంది అన్నావు కదా అందుకే అమ్మమ్మ అన్నాను అని అంటుంది ఆకాంక్ష. అమ్మమ్మ అని నిన్ను పిలవకూడదా అని అభాయ్ అంటాడు. లేదమ్మా నీ మాటలు వింటుంటే మా అమ్మాయితో మాట్లాడినట్టే నా మనసు నిండిపోయింది నువ్వు అమ్మమ్మ అని పిలువు అని అంటుంది పద్మావతి. సరే అమ్మమ్మ ఇకమీదట నుంచి మీరు ఒంటరి వాళ్ళు కాదు మేమే నీ మనుమడు మనుమరాలుము అని ఆకాంక్ష అంటుంది. అంటే మీ మనవడు మనవరాలు అనుకోండి అంటుంది అమ్మమ్మ అని అభాయ్ అంటాడు. పిల్లలు మీతో మాట్లాడుతూ ఉంటే టైమే తెలియట్లేదు మీకు స్కూలుకు లేటవుతుంది వెళ్ళండి అని సుబ్రహ్మణ్యం అంటాడు. అదేంటి తాతయ్య మేము మీ మనవడు మనవరాళ్లమని అనుకుంటున్నారా లేదా అని ఆకాంక్ష అంటుంది. అక్కి ఎందుకలా అంటున్నావ్ అని అభాయ్ అంటాడు.  తాతయ్యని మనతో పాటు తీసుకువెళ్తే అమ్మను చూస్తాడు కదా అప్పుడు మనం ప్రామిస్ తప్పినట్టు అవ్వదు కదా అమ్మానాన్నలని చూసి గుర్తు పట్టి వాళ్ళిద్దర్నీ కలుపుతాడు తాతయ్య అని అక్కి అంటుంది. అవును అక్కి ఎస్ ఎస్ అని అభయ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 21 2023 Episode 1131 Highlights
Prema Entha Madhuram Today Episode December 21 2023 Episode 1131 Highlights

ఏంటి పిల్లలు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అని సుబ్రహ్మణ్యం అంటాడు. ఏమీ లేదు తాతయ్య ఇప్పుడు మేము స్కూలుకి ఎందుకు వెళ్లలేదని అమ్మ అడుగుతుంది మేము చెప్పిన నమ్మదు అందుకే నువ్వు వచ్చి మమ్మల్ని ఇంటిదగ్గర వదిలిపెట్టి రండి అని చెప్తుంది ఆకాంక్ష. పిల్లలు చెప్పింది కూడా కరెక్టే మాతా నేను పిల్లల్ని వాళ్ళ అమ్మకు అప్పగించి వస్తాను అని సుబ్రహ్మణ్యం పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, సుబ్బు పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తాడు.వాళ్లు ఆటో దిగుతూ ఉండగా కొంతమంది స్వాములు స్వామి శరణం ఇక్కడ గుడిలో కన్య స్వామికి మాలధారణ చేస్తున్నాడు అంట గురుస్వామి అని చెప్పి వెళ్ళిపోతారు. తాతయ్య మాల వేసుకుంటే కోరికలు ఏవైనా నెరవేరుతాయి అని అభాయ్ అంటాడు. కోరికలు తీరడం కోసం మాల వేసుకోకూడదు అయ్యప్పను నమ్మి మాల వేసుకుంటే మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అని సుబ్రహ్మణ్యం అంటాడు. తాతయ్య ఇంకా దేవుడి గురించి వివరంగా చెప్పు అని ఆభయ్ అంటాడు. సుబ్రహ్మణ్యం అలా పిల్లలతో మాట్లాడుతూ ఉండగా అను కిటికీలో నుంచి వాళ్ళ నాన్నను చూస్తుంది. ఇదేంటి నాన్న పిల్లల్ని తీసుకొని వచ్చాడు నిజం తెలిసిపోయిందా ఇప్పుడు ఎలా అని కంగారు పడుతుంది అను. పిల్లలు ఇప్పటికే లేట్ అయింది మీ అమ్మకు అప్పచెప్పి నేను వెళ్తాను పదండి అని సుబ్రహ్మణ్యం పిల్లల్ని తీసుకొని లోపలికి వస్తాడు.

Prema Entha Madhuram Today Episode December 21 2023 Episode 1131 Highlights
Prema Entha Madhuram Today Episode December 21 2023 Episode 1131 Highlights

కట్ చేస్తే,అమ్మ అమ్మ అంటూ ఆకాంక్ష బయటి నుంచి పిలుచుకుంటూ వస్తుంది. ఇదేంటి నాన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నాడు అని టెన్షన్ పడుతుంది అను.  అక్కి మీరు స్కూలుకు వెళ్లలేదా ఏంటి ఇంటికి వచ్చేసారు అని సుగుణ అంటుంది. లేదు మాత నేను గుడికి వెళ్లి వస్తూ ఉండగా కళ్ళు తిరిగి కింద పడిపోయాను అప్పుడు పిల్లలు నన్ను కాపాడి ఇంటి దగ్గరి కి తీసుకువెళ్లారు అందుకే నేను మీకు చెప్పి పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెడదామని వచ్చాను మాత అని సుబ్రమణ్యం అంటాడు. అవునా చాలా మంచి పని చేశారు నాన్న అని సుగుణ అంటుంది. మాత నేను ఇక బయలుదేరుతాను అని సుబ్రహ్మణ్యం అంటాడు.తాతయ్య నువ్వు కొద్దిసేపు కూర్చో మా అమ్మని పిలుసుకు వస్తాము అని అభాయ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు.

Prema Entha Madhuram Today Episode December 21 2023 Episode 1131 Highlights
Prema Entha Madhuram Today Episode December 21 2023 Episode 1131 Highlights

కట్ చేస్తే, పిల్లలు అను కోసం రూమ్ అంతా వెతుకుతారు ఎక్కడ కనిపించదు తాతయ్య మా అమ్మ ఇంట్లో లేదు రూమ్ అంతా వెతికాను బయటికి వెళ్లిందేమో తీసుకొస్తాం ఉండండి అని పిల్లలు వెళ్ళిపోతారు. ఇంతలో సుగుణ స్వామికి కాఫీ ఇస్తుంది. మాతా నేను ఇప్పుడు మాలలో ఉన్నాను ఏమి అనుకోకండి నేను తాగను అని సుబ్రహ్మణ్యం అంటాడు. అయ్యో ఏం పర్వాలేదండి అని సుగుణ అంటుంది. ఎంతైనా ఆడపిల్లలు ఉంటే   ఇళ్లు కలపలలాడుతుంది అని సుబ్రమణ్యం అంటాడు.నేను మాటల్లో పడి మర్చిపోయాను వీళ్ళు నాకు ముగ్గురు బిడ్డలు వీళ్ళతో పాటు ఒక కొడుకు కూడా ఉన్నాడు బయటికి వెళ్లాడు వచ్చేస్తూ ఉంటాడు అని సుగుణ చెప్తుంది. పిల్లలు వాళ్ళ అమ్మ కోసం బయట అంతా వెతుకుతూ ఉంటారు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N