NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram January 16 2024 Episode 1153: అక్కిని నవ్వించడానికి తిప్పలు పడుతున్న పిల్లలు..

Prema Entha Madhuram Today Episode January 16 2024 Episode 1153 Highlights

Prema Entha Madhuram January 16 2024 Episode 1153:ఓకే ఏడవకు ఏమీ కాదులే అని అభాయ్ అంటాడు. అక్కి ఏడవకు మేము నీతో ఆడుకోడానికేగా వచ్చింది అని ఆకాష్ అంటుంది. ఓకే మేమంటే నీకు ఇష్టం కదా నాతో మాట్లాడవా అని ఉష నవ్వమ్మ అని అంటుంది. అక్కిని నవ్వించడానికి వాళ్ళందరూ ప్లాన్ వేసి  ప్రయత్నిస్తూ ఉంటారు. ఆనందు కవిత చెప్తాడు కానీ అక్కి నవ్వదు. అభయ్ నవ్వించడానికి డాన్స్ వేస్తూ ఉంటాడు. అంజలి వచ్చి ప్లీజ్ అక్కి నువ్వు నీకు దండం పెడతాను అని ఆకాంక్ష కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడి ప్లీజ్  నవ్వవే అని అంటుంది. అక్కిని నవ్వించడానికి వాళ్ళందరూ ముక్కుతిప్పలపాడి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంతలో ఆర్య యాదగిరి వచ్చి ఏమైంది అని అడుగుతారు.   అక్కి  ఎంత ప్రయత్నించినా నవ్వడం లేదు అని ఉషా చెప్తుంది. దానికి ఎందుకు అంత బాధ నేను నవ్విస్తాను ఉండండి అని యాదగిరి కుప్పిగంతులు వేస్తూ ఉంటాడు.

Prema Entha Madhuram Today Episode January 16 2024 Episode 1153 Highlights
Prema Entha Madhuram Today Episode January 16 2024 Episode 1153 Highlights

యాదగిరి బావా దీని నవ్వించడం అంటారా కుప్పిగంతులు వేయడం అంటారు అన్నయ్య నువ్వు నవ్వించడానికి ప్రయత్నించు అని ఉష అంటుంది. నిన్ను ఎలా నవ్వించాలో నాకు తెలుసు అని చాక్లెట్ తీసి చూపెట్టి ఎంత ప్రయత్నించినా అక్కి నవ్వదు కదా కన్నెత్తి కూడా చూడదు. యాదగిరి అక్కి కి చాక్లెట్ అంటే చాలా ఇష్టం తనకి ఇష్టమైన చాక్లెట్ నేను తినేస్తాను అప్పుడేనా మాట్లాడుతుందా లేకుంటే చాక్లెట్ లాక్కుంటుందో చూద్దాం అని తినబోతాడు ఆర్య. అక్కి లేచి వచ్చి నాన్న అని ఆర్య అని పట్టుకుని ఏడుస్తుంది. నేను హగ్ చేసుకున్నది చాక్లెట్ కోసం కాదు నాన్న నీకోసం నీతో ఉంటే చాలా బాగుంటుంది నువ్వు మాకు ఎప్పుడు దూరం కాకూడదు నాన్న అని అక్కి ఏడుస్తుంది. నేనెక్కడికి వెళ్తాను నీతోనే ఉంటాను మీరు ఎప్పుడు ఏడవకూడదు అని ఆర్య అక్కిని నవ్వమంటాడు. అక్కి చిన్న స్మైల్ ఇస్తుంది గుడ్ గర్ల్ ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి అని ఆర్య అంటాడు. ఫ్రెండ్ నువ్వు ఎప్పుడూ మాతో ఉంటే నేను చెల్లి చాలా ఆనందిస్తాం నువ్వు ఎప్పుడూ ఇలాగే మా తోటి ఉండు ఫ్రెండ్ అని అభయ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 16 2024 Episode 1153 Highlights
Prema Entha Madhuram Today Episode January 16 2024 Episode 1153 Highlights

అమ్మ దొంగ మేము ఇంతమంది నవ్విచ్చిన నవ్వలేదే మీ డాడీ చెప్పగానే నువ్వు నవ్వావు అని అంజలి పిల్లలందరూ కలిసి ఆకాంక్షని నవ్విస్తూ తీసుకెళ్లి పోతారు. ఆ ఆనందం చూసి ఆ యాదగిరి కళ్ళలో కన్నీళ్లు వస్తాయి. ఏమైంది యాదగిరి అని అంటాడు. అదే సార్ ఇన్ని రోజులు తండ్రి ప్రేమకు దూరమైన పిల్లలు మీరు తండ్రి కాబోతున్నారని తెలిసి అక్కి  ఎంత ఆనందిస్తున్నారు అని కళ్ళ నీళ్లు  పెట్టాడు యాదగిరి. అది యాదగిరి నా బాధంతా నేను వాళ్ళు దూరం అవుతానని తెలిస్తే నన్ను ద్వేషిస్తారేమో కానీ వాళ్ళ తండ్రిని తెచ్చి ఇవ్వలేను అలాగని పిల్లలు నా మీద పెంచుకునే ప్రేమని కాదనలేను నా పరిస్థితి ఏంటో అర్థం కాక నాలో నేను నలిగిపోతున్నాను యాదగిరి అని ఆర్య కన్నీళ్లు పెట్టుకుంటాడు. మికు పెళ్లి జరిగిన అన్యాయం జరగదు సార్ ఎందుకంటే మంచి మనుషులకి ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు సార్ నా మాట నమ్మండి సార్ అనీ యాదగిరి అంటాడు. ఏమో యాదగిరి కానీ అనుకి నా పిల్లలకి అన్యాయం చేస్తున్నానేమో  అని నా మనసుకి అనిపిస్తుంది కానీ నా బాధ్యత నా కాళ్ళని కట్టేసింది నా నోరుని మూసేంచింది దీనికి పరిష్కారమే దొరకట్లేదు యాదగిరి ఈ పెళ్లిలోపైన వాళ్ళ నాన్నని వెతికి తేవాలి అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 16 2024 Episode 1153 Highlights
Prema Entha Madhuram Today Episode January 16 2024 Episode 1153 Highlights

ఏముంది సార్ పెళ్లి అయితే మీరే వాళ్ళ తండ్రి అయిపోతారు కదా దానికి మళ్ళీ వెతికి తెచ్చి ఇవ్వడం దేనికి అని యాదగిరి అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ యాదగిరి నేను వాళ్ళ తండ్రిని ఏంటి అని ఆర్య అంటాడు.అంటే ఈ పెళ్లి తో వాళ్ళకి తండ్రి ఆమెకి తోడు దొరుకుతారు కదా సార్ అని అర్థం అని యాదగిరి మాట మార్చేస్తాడు. కట్ చేస్తే, ఘోర మల్లి అంజలి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏంటి ఇక్కడ పిల్లల వాసన రావట్లేదు ఎక్కడికి వెళ్లారు అని ఇతని మంత్ర శక్తితో చూస్తాడు పిల్లలు బయట ఉన్నారని తెలుసుకొనివాళ్లు ఉన్న చోటికి  వెళ్లాలి అనుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, అందరూ మెహందీ ఫంక్షన్ కి రెడీ అయిపోతారు.మెహందీ ఫంక్షన్ చేస్తూ హరీష్ నువ్వు దివ్యకి గోరింటాకు పెట్టు అని సుగుణ చెప్తుంది.  నాకు గోరింటాకు పెట్టడం రాదు అని హరీష్ అంటాడు. పెట్టాలి అని యాదగిరి  అంటాడు. ఏం అక్కర్లేదు హరీష్ నేను చెప్తూ ఉంటాను నువ్వు పెట్టు అదే డిజైన్ వచ్చేస్తుంది అని దివ్య అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 16 2024 Episode 1153 Highlights
Prema Entha Madhuram Today Episode January 16 2024 Episode 1153 Highlights

అదంతా కాదు దివ్య అక్క నువ్వు బావ నీకు గోరింటాకు పెడితే నీకు ఎంత ఎర్రగా పండితే అంత ప్రేమ ఉంటుంది అని మాకు తెలుస్తుంది అని ఉష అంటుంది. జ్యోతి అయితే నా మీద ఎంత ప్రేమ ఉందో చూపించవే గోరింటాకు పెట్టు అని యాదగిరి అంటాడు. బావగారు మీరే ముందు స్టార్ట్ చేయండి తెలుస్తుంది అని ఉషా గోరింటాకు తెచ్చి అందరికీ ఇస్తుంది. ఏముంది పెట్టడానికి వంకలు వంకలు తిప్పి పెడితే అదే గోరింటాకు డిజైన్ అయిపోతుంది ఇది ఈ బజారు అది ఆ బజారు ఇది హైదరాబాద్ చౌరస్తా అది సికింద్రాబాద్ చౌరస్తా అనే జ్యోతి చెయ్యి పట్టుకుని యాదగిరి అంటాడు. మీరు ఉండండి నేను పెడతాను అని జ్యోతి యాదగిరి కి గోరింటాకు పెడుతుంది. యాదగిరి జ్యోతి కి గోరింటాకు పిచ్చిపిచ్చిగా పెడతాడు.

Prema Entha Madhuram Today Episode January 16 2024 Episode 1153 Highlights
Prema Entha Madhuram Today Episode January 16 2024 Episode 1153 Highlights

ఏంటండీ  చేతబడి ముగ్గుల పెట్టారు చూడండి ఎలా పెట్టారో అని జ్యోతి ఫీల్ అవుతుంది. అక్క నీకు బాగా అయింది బావ ఈ చివరస్త ఆ చివర వస్తాను నీ చేతిలో చూపెడుతున్నాడు కానీ ఎప్పుడైనా బైక్ మీద ఎక్కించుకొని ఆ చివర స్థలాన్ని తిప్పి చూపించాడా అని ఉషా అంటుంది. అది విని అందరూ నవ్వుతారు. ఇప్పుడు అన్నయ్య రాధ గారికి గోరింటాకు పెట్టాలి అని ఉష అంటుంది. ఉష నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ పెళ్లి ఫస్ట్ మాది ఏది చేసినా ఫస్ట్ మేము చేయాలి అని దివ్య అంటుంది. దివ్య ఏంటే నీ మాటలు అని సుగుణ అంటుంది. ఆంటీ ఎందుకలా కోప్పడతారు దివ్య అని ముందు గోరింటాకు పెట్టనివ్వండి ఆ తర్వాత నేను సూర్య గారికి పెడతాను అని అను అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N