Star heroine: ఏ రంగంలో అయినా ప్రత్యేకమైన పాపులారిటీ రావాలంటే ఓ అదృష్టం ఉండాలి. ఒక్కొక్కసారి అందనంత ఎత్తులో ఉన్నవారు ఒకానొక సమయంలో అపజయాన్ని వెలుగు చూస్తారు. ముఖ్యంగా మూవీ ఇండస్ట్రీలో నటీనటులు గుర్తింపు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. తమ పాత్రలో ప్రాణం పెట్టి నటిస్తేనే కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేరు.
తొలుత ఒడుదొడుకులను ఎదుర్కొన్న.. అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అంచలంచలుగా ఎదిగిన నటీనటులు కొందరే ఉంటారు. ఈ కోవకి చెందిన వారే రమ్యకృష్ణ. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన ” బాహుబలి ” సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ అందుకుంది రమ్యకృష్ణ. ఇక ఒకప్పుడు ఈమె సినిమాలు దారుణంగా ఫ్లాప్ కావడంతో ఫ్లాప్ నటిగా పేరుపొందింది.
ఇక అనంతరం బాహుబలి సినిమాలో శివగామి పాత్రను పోషించి మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది రమ్యకృష్ణ. ఇక వీరిద్దరికీ ఒక బాబు కూడా జన్మించాడు. చంద్రలేఖ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. ఇలా ఒకానొకసారి ఫ్లాప్ నటిగా పేరు పొంది అనంతరం ప్రభాస్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయి.. డైరెక్టర్ తో ప్రేమ, పెళ్లి అంటూ ఫుల్ పాపులర్ అయింది రమ్యకృష్ణ.