Subhashree Rayaguru: బిగ్‌బాస్ తెలుగు సీజన్-7లో ఉన్న 14 మందిలో ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. హౌజ్‌లో ఎవరికీ వారు తమ గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ సారి బిగ్‌బాస్ హౌజ్‌లో గ్లామర్ షో కూడా బాగానే ఉంది. బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న ముద్దుగుమ్మలో ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు. వీరిలో శుభశ్రీ రాయగురు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు.

హౌజ్‌లోకి వస్తూనే స్టేజ్‌పై నాకు తెలుగు రాదని, తెలివి మాత్రం ఉందని అంటూ క్యూట్ మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే బిగ్‌బాస్ హౌజ్‌కి రాకముందు పలు సినిమాల్లో ఆమె నటించారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అయితే సినిమాల్లో శుభశ్రీకి పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’లో నటించినట్లు బాంబు పేల్చింది. దాంతో ఈ భామ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. శుభ శ్రీ ఎవరు? మా లైఫ్ జర్నీ, కెరీర్, ఫ్యామిలీ, వ్యక్తిగత విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శుభశ్రీ రాయగురు వ్యక్తిగతం..
1997 ఏప్రిల్ 15న ఒడిషాలో పుట్టి పెరిగింది. సెయింట్ మేరీస్ ఖమ్మంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆటలు, నటనలో ఆమెకు మక్కువ ఎక్కువ. స్కూల్ స్థాయిలో ఖో ఖో, కబడ్డీలోను తను సత్తా చాటేది. అలాగే శుభశ్రీకి యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఎక్కువ. సినిమాలు చూస్తూ పెరిగింది. సినిమాల్లో రాణించాలని అనుకుంది. చదువుకుంటూనే సినీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. కాలేజీ డేస్ నుంచే మోడలింగ్‌పై దృష్టి సారించింది. కాలేజ్ డేస్‌లోనే మోడలింగ్‌లో ‘వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా 2020’ విజేతగా నిలించింది. ఆ తర్వాత యాంకర్‌గా కూడా కొనసాగింది. పలు లైవ్ షోలకు హోస్ట్‌గా అలరించింది. కొంచెం ఫేమ్ రావడంతో సినిమాల్లో నటిగా కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. స్వతహాగా లాయర్ అయిన శుభశ్రీ గాయగురు సినీ పరిశ్రమ మీద ఆసక్తితో ఇటు వైపు వచ్చింది. మొదటగా హీరోయిన్‌గా ప్రయత్నించినా.. సైడ్ రోల్స్ చేస్తూ వస్తోంది. అయితే సినిమాల్లో అవకాశాలు పెరగడంతో ఒడిషా నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చారు.

‘రుద్రవీణ’ సినిమాతో ఆరంగేట్రం..
సినిమాలపై మక్కువతో ఆ దిశగా అడుగులు వేసింది. మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ‘మస్తీజాదే’ అనే హిందీ సినిమాకు శుభ శ్రీ రాయగురు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసశారు. ఆ తర్వాత తెలుగులో ఆమెకు సినిమాలో అవకాశం వచ్చింది. ‘రుద్రవీణ’ అనే సినిమాతో ఆమె ఆరంగేట్రం చేసింది. ఈ సినిమా 2022లో విడుదలైంది. తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. తమిళ్‌లో ‘డెవిల్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నటిగా ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు రావడంతో తెలుగు, తమిళ సినిమాల్లో ఆమెకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. హీరో కళ్యాణ్ రామ్ సినిమా ‘అమిగోస్’లో శుభ శ్రీ రాయగురు చిన్న పాత్ర పోషించారు. 2023లో ‘కథ వెనుక కథ’ అనే సినిమాలో ఆమె నటించి ప్రేక్షకులను మెప్పించారు.

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో ఛాన్స్..
బిగ్‌బాస్‌లో శుభశ్రీ రాయగురు తన రీసెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చింది. తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఆయనతో కలిసి నటించానని, అదే సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ’ సినిమా అని అన్నది. సినిమా చాలా స్టైలిష్‌గా, ఎంటర్ టైనర్‌గా ఉంటుందన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది.
సోషల్ మీడియాలో ఫాలొవర్స్ ఎక్కువే..
శుభ శ్రీ రాయగురుకు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువ. మోడలింగ్‌తోనే కెరీర్ స్టార్ట్ చేయడంతో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో శుభశ్రీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు. శుభ శ్రీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 417కే ఫాలొవర్స్ ఉన్నారు.