Subhashree Rayaguru Bigg Boss 7: నాగార్జున సారధ్యం లో బిగ్ బాస్ సీజన్ 7 మొదలైంది కానీ.. పోటీదారుల్లో తెలుగు వాళ్లు ఎందరు? అందులో అమ్మాయిలు ఎందరు ?అని చూస్తే వచ్చిన వాళ్లలో తెలుగు అమ్మాయిలు కరువయ్యారు. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన 14 మందిలో ఏడుగురు అమ్మాయిలు ఉంటే.. వాళ్లలో ఇద్దరే ఇద్దరు తెలుగు వాళ్లు ఉన్నారు. ఒకరు సింగర్ దామిని (ఏపీ), రతిక (తెలంగాణ) మిగిలిన ఐదుగురు పక్క రాష్ట్రం అమ్మాయిలే ఈ సారి మంచి మాస్ మసాలా ఉండేలా ప్లాన్ చేశారు. రుద్రవీణ ఫేమ్ శుభశ్రీ రాయగురు హౌస్‌లోకి ఐదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ్‌లో ఈ బ్యూటీ ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసింది. ‘అమిగోస్’ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించింది.

ఈ ఒడిశా అందగత్తె బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి.. ‘నాకు తెల్గు రాదు కానీ.. తెల్వి ఉందీ’ అని ఎంట్రీలోనే తనకి తెలుగు భాష మీద తన కు ఎంత పట్టు ఉందో చూపించింది.
శుభశ్రీ రాయగురు ఒడిశాలో పుట్టిపెరిగిన యువ నటి. ఆమె 1997 ఏప్రిల్ 15 నాడు పుట్టింది. ఈమె సినిమా నటి, మోడల్. ఆమె 2022లో వచ్చిన తెలుగు సినిమా రుద్రవీణ, తమిళ సినిమా డెవిల్ లతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తరువాత 2023లో అమిగోస్, కథ వెనుక కథ వంటి పలు చిత్రాల్లోనూ ఆమె నటించింది

ముంబైలో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసిన ఆమె లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయినప్పటికీ ఆమెకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. అలా 2020లో వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. తర్వాత టెలీవిజన్ యాంకర్‌గా మారింది. హిందీ సినిమా మస్తీజాదే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా ఆమె వ్యవహరించింది.

2023 సెప్టెంబరు 3న స్టార్ మాలో ప్రారంభమైన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7లో ఆమె ఓ హౌస్‌మేట్. ఈమె ముంబైలో కేంద్రీయ విద్యాలయలో చదువుకుంది. ఆమె స్కూల్ స్థాయిలో మంచి స్పోర్ట్స్ ప్లేయర్ గా ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ సహా ఎన్నో స్పోర్ట్స్‌లో సత్తా చాటింది. ఆ తరువాత కె.వి. న్యాయ కళాశాల నుంచి ఆమె న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా (బ్యాచిలర్ ఆఫ్ లా) పుచ్చుకుంది. కాలేజీ రోజుల్లో ఆమె మోడలింగ్ చేసింది. VLCC ఫెమినా మిస్ ఇండియా ఒడిశా 2020 ని ఆమె గెలుచుకోవడంతో ఆమె కి టీవి యాంకర్‌గా అనేక లైవ్ షోలు నిర్వహించే అవకాశాలు వచ్చాయి.

Subhashree Bigg Boss 7 Telugu: అలాగే నటన మీదున్న ఆసక్తితో ఆమె హైదరాబాద్ చేరుకుని సినిమా రంగంలో ప్రవేశించింది. దానికి ముందు ఆమె కొంతకాలం లాయర్‌గా పనిచేసింది.
అదృష్టం ఏంటంటే.. ఏదోరకంగా ఆమె తెలుగు మాట్లాడుతుంది.. అర్ధం చేసుకుంటుంది.. హౌస్‌లో చర్చలు జరుగుతుంటే తెల్లమొహం వేయకుండా కల్పించుకుని కలివిడిగా మాట్లాడుతుంది. ఇన్వాల్వ్ అవుతుంది. అయితే ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి ముందే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. దానిలో భాగంగా తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడం తనకి అత్తారింటికి వెళ్తున్నట్టు ఉందని చెప్పింది. ఇదేవిట్రా బాబు అనుకున్నారు జనాలు ఆ పోలికకి. ఇదేదో తేడా ఉందే అనుకోవచ్చు కానీ.. అసలు ఆమె తన గురించి ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే విందాం.

‘నేను బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చే ముందు.. నా నాన్న, అమ్మ వంట గురించి శిక్షణ ఇచ్చారు. మా నాన్న అయితే సాంబార్ , పచ్చడి ఎలా చేయాలో అమ్మని అడిగి నేర్చుకో.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తరువాత అందరికీ చేసి పెట్టు’ అని చెప్పేవారు. కొత్తగా పెళ్లైన అమ్మాయిని అత్తారింటికి పంపినట్టు పంపారు. బిగ్ బాస్ తనకు పెళ్లి ముందు ట్రైనింగ్ లా ఉందని చెప్పింది ( అదేం పోలికో) తన బట్టలు తానే ఉతుక్కుంటా.నని . వాషింగ్ మెషిన్‌లో వేయడం తెలుసు అని చెప్పింది . బట్ బిగ్ బాస్ హౌస్‌లో వాషింగ్ మెషిన్ ఉండదు కదా.. తన బట్టలు ఎవరైనా ఉతికితే బాగుండును అంది.

తనకు రియల్ లైఫ్‌లో బాయ్ ఫ్రెండ్ లేరాని చెప్పింది. రీల్ లైఫ్‌లో కూడా లేరుట . బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తరువాత తనకి నచ్చే వ్యక్తి ఒకవేళ దొరికితే మాత్రం కమిట్ అవుతా అంది. వామ్మో . ఈమెకు డాన్స్ బాగా వచ్చు. తాను సింగిల్ హ్యాండ్‌తో చప్పట్లు కొట్టగలను.
అని అంటోంది. ఎలా? అమిగోస్ సినిమా తో తనకు మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పింది శుభశ్రీ . హాలీవుడ్ హీరోయిన్ ఏంజిలినా జోలీలా తాను ఉందని కొందరు పోల్చారు. ఒరిస్సాలో పుట్టి . ఆ తరువాత ముంబైకి షిఫ్ట్ అయ్యి.. లాయర్ చదివి, యాక్టింగ్ కోర్స్‌లు చేసి లా అంటే అంత ఈజీ కాదు.అని తెలుసు కుంది. కొన్నాళ్లకు లా బోరింగ్ అనిపించింది ట . అందుకే ఇలా యాక్టింగ్ చేస్తూ ఉన్నా.. ఇప్పుడు బిగ్ బాస్ షో మీ ముందుకు వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చింది శుభ శ్రీ రాయగురు

Bigg Boss 7 Telugu: నామినేషన్ లో ఉన్న ఇంటి సభ్యులకు వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్..?
ఇక కాలేజీ రోజుల్లో శుభశ్రీ మోడలింగ్ కూడా చేసింది. ‘VLCC ఫెమినా మిస్ ఇండియా ఒడిశా 2020’ని కూడా గెలుచుకుంది. తర్వాత శుభశ్రీ యాంకర్‌గా అనేక లైవ్ షోలు కూడా చేసింది . ఇక 2022లో రుద్రవీణ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత డెవిల్ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇక రీసెంట్‌గా కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాలో కూడా ఓ పాత్ర పోషించింది. ఇప్పుడు బిగ్‍బాస్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫిజికల్ టాస్క్‌ల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
Bigg Boss 7 Telugu: నామినేషన్ లో ఉన్న ఇంటి సభ్యులకు వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్..?