Venkatesh: నువ్వు నాకు నచ్చావ్ నేటితో 22 ఏండ్లు పూర్తి చేసుకుంది. విక్టరీ వెంకటేష్ నట జీవితంలో ని సూపర్ హిట్ సినిమాలలో ముందు చెప్పాల్సిన సినిమా ఇది. ఈ సినిమా ని తెలుగు వాళ్ళ ఇళ్లల్లో ఎన్ని సార్లు చూసి ఉంటారో లెక్క తెలీదు. ప్రతీ పండుగకి ఎదో ఒక ఛానల్ లో ఈ సినిమా వస్తూనే ఉంటుంది. వచ్చిన ప్రతి సారి కొత్తగా నే మళ్ళీ మళ్ళీ చూస్తాం. అంత గా తెలుగు వారి హృదయాల్లో నాటుకు పోయిన సినిమా. చిన్నా పెద్దా కూడా ఇందులోని డైలాగ్స్ బట్టీ పట్టిన వారే.

శ్రీసవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ హాస్యరస భరిత చిత్ర రాజం వెంకీ కెరీర్‌లో ని అత్యుత్తమ చిత్రాలలో ఒకటి. ప్రేమ, హాస్యం ల చక్కటి కలయిక గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు చిత్ర సీమలో ఒక సూపర్ హిట్ సినిమానే కాక మూవీ లవర్స్ ఆల్‌టైమ్ ఫేవరేట్ హిట్ సినిమాల లో కూడా మొదటి వరస లో ఉంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథనందించడంతోపాటు డైలాగ్స్ కూడా రాశాడని తెలిసిందే. సినిమాలో దాదాపు ప్రతీ సన్నివేశంలో త్రివిక్రమ్ డైలాగ్స్ మ్యాజిక్ కనిపిస్తుంటుంది. ఇంత చక్కని కధ , మాటలు దొరికాక ఇక దర్శకుడి పని ఎక్కువగా ఉండదు. పాడుచేకుండా తీయడమే. అదే చేసాడు విజయ్ భాస్కర్.

ప్రకాశ్ రాజ్, ఎమ్మెస్ నారాయణ, సునీల్, చంద్రమోహన్, బ్రహ్మానందం, బాబు మోహన్, మల్జికార్జున రావు, హేమ శ్రీలక్ష్మి, మేల్కొటే.. ఇలా సినిమాలో ప్రతీ పాత్ర పండించే కామెడీ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఇందులో వెంకటేశ్ అనకాపల్లిలో డిగ్రీ పూర్తి చేసి.. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చిన వెంకటేశ్వర్లు పాత్రలో పండించిన హాస్యాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ సినిమా వచ్చి రెండు దశాబ్ధాలు దాటినప్పటికీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో కొన్ని సన్నివేశాలు గుర్తు చేసుకుందాం . ఇద్దరు చిన్ననాటి స్నేహితుల పిల్లల మధ్యన జరిగే ప్రేమ కధ ను అత్యంత నాణ్యమైన హాస్యంతో నింపి తీసిన చిత్రం ఇది.

వెంకటేష్ చిన్నతనం లో స్లిప్ లు పెట్టి కాపీ కొట్టేవాడని చంద్రమోహన్ రాసిన ఉత్తరం, వెంకటేష్ ప్రకాష్ రాజ్ అవుట్ హౌస్ లో దిగినప్పుడు సునీల్ తో కామెడీ , ఎమ్మెస్ నారాయణ పేకాట పిచ్చి, బంతి పాత్రలో సునీల్, సూర్యకాంతం బొమ్మ కి రిపేర్ చేయడం, ప్రకాష్ రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గిర చెప్పే కవిత మొహమాటంగా చెప్పడం, వెంకీ, ఆర్తి, వండర్ వరల్డ్ పార్క్ కి వెళ్లడం , ఆశా సాయిని ఎపిసోడ్స్ లాంటి ఎన్నో సన్ని వేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీటికి తోడు వెంకటేష్, ప్రకాష్ రాజ్ , సుహాసిని, చంద్రమోహన్ నటన చక్కగా ఉంటుంది. వెంకటేష్ చాలా చక్కగా పరిణతితో నటన చేశాడు.

ప్రతి రోజూ ఎవరో ఒకరు ఈ సినిమాలో జోక్ చెప్పకుండా ఉండరు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు మాటల మాంత్రికుడిగా టాలీవుడ్ లో మారు మోగి పోయింది. మనలనందరినీ ఇంతగా అలరించిన ఈ సినిమా వచ్చి అప్పుడే 22 ఏళ్ళు అయిందా అని ఆశ్చర్యం కలగక మానదు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి బెస్ట్ డైలాగ్ రైటర్ గ నంది అవార్డు కూడా వచ్చింది. కొన్ని డైలాగ్స్ నీకు ఆంజనేయస్వామి తెలుసా ? గుళ్లో చూడడమే గాని బయట పరిచయం లేదు ఆఫీస్ మేట్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బావుంది లాంటివి రోజూ గుర్తుకి వస్తాయి.
Devuda.. o manchi Devuda
Thank you for giving us #NuvvuNaakuNachav 🩷Celebrating 22 glorious years Of the evergreen BlockBuster today ✨#22YearsOfCultClassicNNN#VictoryVenkatesh @VenkyMama #AarthiAgarwal#VijayaBhaskar #Trivikram#Brahmanandam
@suneeltollywood #Koti pic.twitter.com/dhAs0vihwO— Suresh Productions (@SureshProdns) September 6, 2023
22 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సురేశ్ ప్రొడక్షన్స్ వారు దేవుడా ఓ మంచి దేవుడా.. మాకు నువ్వు నాకు నచ్చావ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ సినిమాలో వెంకీ చెప్పే డైలాగ్‌ను ట్వీట్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది . ఇప్పుడీ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఆ ట్వీట్ చూసి జనం మళ్ళీ ఈ సినిమా ను గుర్తు చేసుకుంటున్నారు.