Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయ్యి నాలుగు వారాలు గడవడం తెలిసిందే. మొత్తం 14 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా.. నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇదే సమయంలో ఉల్టా పల్టా మాదిరిగానే మొదటివారం నుండి హౌస్ లో పోటీ ఉండే మాదిరిగా రకరకాల టాస్కులు పెడుతున్నారు. పవరస్త్ర పేరుతో ఇమ్యూనిటీ సంపాదించుకోవడానికి ఇంటి సభ్యులకు రకరకాల గేములు పెడుతూ వారి మధ్య పోటీ వాతావరణం ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటివరకు నాలుగు పవరస్త్ర లకి గేమ్ గట్టిగా జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇప్పించడానికి బిగ్ బాస్ నిర్వాహకులు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిలో భాగంగా హౌస్ లోకి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి హీరోలు ఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ వారం నుండి వన్డే వరల్డ్ కప్ టోర్నీ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో.. షో నిర్వాహకులు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. దీంతోషోకి ఆదరణ తగ్గకుండా.. తెలుగు చలనచిత్ర సీమలో ఒకప్పుడు హీరోలుగా రాణించిన అవ్వాలని ఇప్పుడు వైల్డ్ కార్డు రూపంలో హౌస్ లోకి పంపించడానికి డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం లేదా బుధవారం ఈ హీరోలు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
తెలుగు బిగ్ బాస్ షోలో దాదాపు మూడు సీజన్ ల వరకు వైల్డ్ కార్డు.. హవా నడిచింది. నాలుగో సీజన్ నుండి వైల్డ్ కార్డు ఎంట్రీ లు ఆపేశారు. కానీ ఫేక్ ఎలిమినేషన్ పేరిట సీక్రెట్ రూములో.. కంటెస్టెంట్లను ఉంచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ టోర్నీ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకుల దృష్టి మరల్చకుండా షోపై ఇంట్రెస్ట్ కలిగేలా… నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు..టాక్ నడుస్తోంది. మరి వస్తున్న వార్తల్లో నిజం ఏంటో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.