NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: వచ్చేది జనసేన – టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమే .. ప్రభుత్వంలో బాధ్యత తీసుకుంటానన్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: 2024 లో ఏర్పడేది జనసేన – టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేననీ, ప్రభుత్వంలో తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని తెలిపారు. నాల్గవ విడత వారాహి యాత్రలో భాగంగా ఆదివారం ఆవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విలువలు, ఆశయాల కోసం పార్టీని నడుతున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని దించడమే తమ లక్ష్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్పే అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. జగన్ అధ్భుతమైన పాలకుడైతే తాను రోడ్డుపైకి వచ్చే అవసరమే లేదని అన్నారు. డబ్బు, భూమి మీద తనకు ఎప్పుడూ కోరేక లేదనీ, నైతిక బలంతోనే ఎంతో బలమైన జగన్ తో గొడవ పెట్టుకుంటున్నానని అన్నారు.

ఈ పదేళ్లలో తన పార్టీ అనేక దెబ్బలు తిన్నదనీ, ఆశయాలు, విలువల కోసం పార్టీ నడుపుతున్నామన్నారు పవన్ కళ్యాణ్. యువత భవిష్యత్తు బాగుండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానన్నారు. రాష్ట్ర భవిష్యత్తు  కోసమే ఓట్లు చీలనివ్వనని తాను చెప్పానన్నారు. మనకు పార్టీ కంటే రాష్ట్రం చాలా ముఖ్యమని అన్నారు. వైసీపీ అధికారంలోకి రావడం వల్ల రాష్ట్ర యువత ఎంతో విలువైన దశాబ్ద కాలం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ అభ్యర్ధుల నియామక ప్రక్రియలోనూ అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ  అండగా నిలుస్తానని చెప్పారు. జరగబోయేది కురుక్షేత్రం అని జగన్ అంటున్నారనీ, ఈ కురుక్షేత్ర యుద్దంలో తాము పాండవులు, వాళ్లు కౌరవులు అని పవన్ అన్నారు.

మధ్య పాన నిషేదం నుండి డీఎస్సీ వరకూ జగన్ మాట తప్పారని అన్నారు పవన్. అనుభవజ్ఞులను జైలులో పెట్టిన వ్యక్తితో తాను తలపడుతున్నానని పేర్కొన్నారు. జగన్ పతనం మెదలైందని అన్నారు.  తాను మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాదని అన్నారు. ప్రజలు విలువైన భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డ్రాప్ అవుట్స్, మిస్సింగ్ లపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జగన్ ఇన్నాళ్లూ రాజకీయ నేతలతో పోరాటం చేశాడనీ, ఇప్పుడు దేశ భక్తి ఉన్న వ్యక్తితో తలపడుతున్నాడని సవాల్ విసిరారు. ల్యాండ్, శాండ్ మాఫియాలతో వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.

అధికార మదం ఉన్న వ్యక్తులను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని అన్నారు. కాదనుకుంటే తనపైనా కేసులు పెట్టుకోవాలని అన్నారు. తాను పారిపోయే వ్యక్తిని కానని పవన్ పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల మాట తీరు చూస్తుంటేనే వారి పరిస్థితి ఏమిటో అర్దమవుతుందని అన్నారు. సీఎం పదవి కోసం తాను వెంపర్లాడనని, అవకాశం వస్తే స్వీకరిస్తానని చెప్పారు. తనకు కులం కంటే గుణం ముఖ్యమని అన్నారు. జగన్ సర్కార్ లో మాదిరిగా కీలకమైన పదవులు అన్నీ ఒకే కులంతో నింపే విధానం తనది కాదని, రాబోయే ప్రభుత్వంలో అలా ఉండదని చెప్పారు. తన అభిమానుల్లో అన్ని కులాలవారు ఉన్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్ ను పట్టి పీడిస్తున్న వైసీపీ మహమ్మారికి జనసేన – టీడీపీ వ్యాక్సినే మందు అని అన్నారు. మనల్ని కులాలుగా వేరు చేస్తున్నారని విమర్శించారు. తనను కాపుల చేతనే తిట్టిస్తున్నారని అన్నారు. సైకిల్, గ్లాస్ కలిసి ఫ్యాన్ ను తరమివేయడం ఖాయమన్నారు. వైసీపీ ఫ్యాన్ కు కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదని అన్నారు. జగన్ పరిస్థితి ఓడిపోయే ముందు హిట్లర్ పరిస్తితిలా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 175 కాదు 15 సీట్లు వస్తే గొప్ప అని అన్నారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు, నాయకులతో పాటు టీడీపీ కార్యకర్తలు, నేతలు హజరైయ్యారు. ఆవనిగడ్డ లోని సభాస్థలి అయిన కళాశాల గ్రౌండ్ మొత్తం అబిమానులతో నిండిపోయింది.

PM Modi: తెలంగాణకు ప్రధాని మోడీ హామీల వర్షం .. పసుపు బోర్డు, గిరిజన వర్శిటీలకు హామీ

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju