NewsOrbit
న్యూస్ హెల్త్

Chyawanprash: చ్యవనప్రాష్ లో ఏముంటుంది? ఇమ్మ్యూనిటి ని పెంచే రహస్య చ్యవనప్రాష్ ఇంగ్రిడిఎంట్స్ ఇవే, ఇవి మీ ఆహారం లో ఉంటే చ్యవనప్రాష్ తో పనిలేదు!

Chyawanprash health benefits, preparation and ingredients

Chyawanprash: చ్యవనప్రాష్.. ఈ పేరులో ఉన్న చ్యవన మహర్షి పూర్వం వృద్ధుడు అయిపోయినప్పుడు తన యవ్వన శక్తిని మొత్తం కోల్పోతాడు.. అయితే ఆయనకు దేవతల అనుగ్రహం ద్వారా వారు చెప్పిన కొన్ని పదార్థాలను ఉపయోగించి ఈ లేహాన్ని తయారు చేశారు.. అందుకే ఈ లేహ్యానికి చ్యవనప్రాష్ అని పేరు.. ఈ లేహ్యం ముందుగా ఆయనే వాడాడు. ఆయన ఈ లేహ్యం వాడిన తరువాత వృద్ధుడు కాస్త మంచి యవ్వనంగా తయారయ్యాడు. అందుకే ఇప్పటికీ కూడా ఆయన పేరు చ్యవనప్రాష్ అని వాడుకులో ఉంది. దీని శక్తి ఏంటంటే ముసలివాడైన చ్యవనడుని మళ్ళీ యవ్వనుడిగా మార్చి సమస్త సుఖ సంతోషాలను అనుభవించే లాగా చేసింది ఈ ఆయుర్వేద చ్యవనప్రాష్ లేహ్యం..

Chyawanprash health benefits, preparation and ingredients
Chyawanprash health benefits preparation and ingredients

చ్యవనప్రాష్ ఉపయోగాలు..

వృద్ధులకు ఈ లేహ్యం అద్భుతంగా పనిచేస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ లేహాన్ని వాడవచ్చు. 30 సంవత్సరాల లోపు ఉన్నవారు ఒక చెంచా చొప్పున రెండు పూటలా తీసుకోవాలి. ఆ పైన వయసున్న వారు మాత్రం రెండు చాలు చొప్పున రెండు పూటలా తీసుకోవాలి. చ్యవనప్రాష్ అనేది వందల సంవత్సరాలుగా ఉపయోగించబడుతుంది ఇది మన మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడే 41 పైగా ఆయుర్వేదిక మూలికలను కలుగుతుంది. జలుబు నుంచి గుండె వరకు అన్ని సమస్యలను నయం చేస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. చ్యవనప్రాష్ ను ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా పిలుస్తారు. మెదడు, శ్వాసకోశ సమస్యలు, జుట్టు, చర్మ సమస్యలు, జీర్ణక్రియ, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. చ్యవనప్రాష్ లేహ్యం ను ఎవరైనా తీసుకోవచ్చు. జలుబు దగ్గు రాకుండా ఉంటాయి. తరచూ చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చేవారు నిత్యం ఈ లేహం తింటే ఆయా సమస్యలు రాకుండా ఉంటాయి. మధుమేహం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా షుగర్ ఫ్రీ చ్యవనప్రాష్ లేహ్యం మార్కెట్లో అందుబాటులో ఉంది. చ్యవనప్రాష్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం.

చ్యవనప్రాష్ తయారీ..

కావల్సిన పదార్థాలు..

ఉసిరికాయలు ఒక కేజీ, నల్ల బెల్లం కేజీన్నర, ఒక చెంచా నల్లమిరియాలు, ఒక చెంచా జీలకర్ర, రెండు చెంచాల సోంపు, యాలుకలు నాలుగు, దాల్చిన చెక్క చిన్న ముక్క, జాజికాయ ఒకటి, జాపత్రి కొద్దిగా , లవంగాలు 10, అల్లం చిన్న ముక్క, తేనె మూడు చెంచాలు, ఆవు నెయ్యి మూడు చెంచాలు.

ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి .తర్వాత ఇందులో విత్తనాలను తీసేసి ఉసిరికాయలను మెత్తగా గుజ్జుగా మిక్సి పట్టుకోవాలి. ఇప్పుడు నల్ల బెల్లం ను దంచి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో ఉసిరికాయ గుజ్జు, నల్ల బెల్లం వేసి బాగా ఉడికించుకోవాలి. మరో పక్కన చిన్న బాండీ పెట్టుకుని అందులో ఆవు నెయ్యి, తేనే తప్ప మిగతా అన్ని పదార్థాలను వేసి వేయించుకోవాలి. వీటిని మెత్తగా పొడి చేసుకుని చేసుకోవాలి. ఈ పొడిని ఉసిరి నల్లబెల్లం మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం దగ్గర పడే వరకు అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత అందులో నెయ్యి, తేనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలి. ఈ మిశ్రమంతో కాస్త గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే చ్యవనప్రాష్ రెడీ. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలోనే నిల్వ చేసుకోవాలి. ఇది సుమారు 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. రోజుకి రెండుసార్లు సమస్య తీవ్రతను బట్టి మూడుసార్లు కూడా తీసుకోవచ్చు..

చ్యవనప్రాష్ బదులుగా ఈ రెండు తీసుకోండి..

చ్యవనప్రాష్ కి ముఖ్యమైన పదార్థాలు ఉసిరికాయ, నల్ల బెల్లం.. ఈ రెండిటి వలన మన శరీరానికి కావలసిన బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.. చ్యవనప్రాష్ అయిపోయినప్పుడు లేదంటే దానిని బదులుగా ఉసిరికాయ నల్లబెల్లం తరచూ తీసుకున్న కూడా అటువంటి ప్రయోజనాలే చేకూరుతాయి.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju