Chicken: మీరు ఎంత చికెన్ ప్రేమికులు అయినా కూడా వారానికి 2 లేదా 3 సార్లు మించి తినకూడదు అని నిపుణులు తెలియచేస్తున్నారు… చికెన్ ని దీనితో పాటు తిన్న సెట్ అయిపోతుంది. అందుకే చాలా మంది దీన్ని రోజు తినడానికి ఇష్టపడతారు. మాంసం తో పోల్చి చూసినప్పుడు చికెన్‌లో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది అని చెప్పక తప్పదు. అందుకే అందరు చికెన్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. అసలు చికెన్ రోజూ తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.
రోజూ తినే ఆహారంలో ప్రోటీన్లు 35 శాతానికి మించి ఉండకూడదు. అంటే రోజూ 50 గ్రాముల కు మించి చికెన్ తినకూడదు. దీన్ని బట్టి వారానికి 350 గ్రాములు సరిపోతుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ తింటే మాత్రం చికెన్ ద్వారా వచ్చే ప్రోటీన్‌ను శరీరం ఫ్యాట్‌గా మారి లోపలే పేరుకు పోతుంది. దానితో బరువు పెరగడం ప్రారంభం అవుతుంది. చికెన్ ఎక్కువగా తినేవారు ఉబ్బినట్లుగా అవుతూ బరువు పెరుగుతారు. నెమ్మదిగా రక్త నాళాల్లో కొవ్వు నిల్వలు పెరిగిపోయి గుండె సంబంధిత జబ్బులు రావడానికి కారణం అవుతుంది. శరీరంలో ప్రోటీన్స్ మరీ ఎక్కువైతే ప్రమాదం తప్పదు మరి .చికెన్ కొంచెం గా తిన్నప్పుడు దాన్ని అరగించుకోవటానికి ఎక్కువ ఎనర్జీ ఖర్చవుతుంది. దాని వలన బరువు తగ్గుతారు. చికెన్‌ను తినాలనుకున్నపుడు వీలైనంత ఎక్కువ సేపు ఉడికించి తినాలి. ఎందుకంటే అందులో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. అది కరోనా లాగే ప్రమాదకరమైనది.
తీవ్రమైన అనారోగ్యం కలిగేలా చేస్తుంది. అందువల్ల మంచి చికెన్ మాత్రమే తినాలి. కోళ్లు త్వరగా పెరగడానికి, వ్యాధులు సోకకుండా బలిష్టంగా కావడానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు చేస్తారు. అవి మనుషుల మీద విషం లా పనిచేస్తాయి. చికెన్ ఎక్కువగా తింటే , విషాన్ని తింటున్నట్లే . ప్రోటీన్స్ కోసం బాదం, చేపలు, గుడ్లు, పప్పులు, గింజలు వంటివి తినడం శ్రేయస్కరం. చికెన్‌ను తగుమాత్రం తింటే మాత్రం ఆరోగ్యానికి మంచిది.