ముక్కులో ఉండే వెంట్రుకలను తీస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

మన శరీరం ఎంతో పరిశుభ్రంగా, అందంగా కనిపించాలని మన శరీరంలో ఏర్పడినటువంటి అవాంఛిత రోమాలను తొలగిస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మన అందం రెట్టింపు అవుతుందని భావిస్తుంటారు. అలాంటి అందం కోసం కొందరు ముక్కులో ఉండేటటువంటి వెంట్రుకలను తొలగిస్తూ ఉంటారు. ముక్కులో వెంట్రుకలు ఉండటంవల్ల కొద్దిగా అందవిహీనంగా కనిపించడం వాస్తవమేఅయినా… ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది.

మన శరీరంలో అవాంచితరోమాలు ఏర్పడడం సర్వసాధారణమే, కానీ హార్మోన్ల అసమతుల్యత వలన కొందరిలో ఈ అవాంఛిత రోమాలు అధికంగా పెరుగుతాయి. ఇలా పెరగడం ద్వారా అవి మన అందానికి అడ్డుగా మారుతాయి. అందువల్ల మనం అందంగా కనిపించడానికి మన శరీరం మీద ఉన్నటువంటి అవాంచిత రోమాలను తొలగిస్తూ ఉంటాము.

మరి ముక్కులో ఏర్పడినటువంటి వెంట్రుకలను తీసివేయడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? అందం కన్నా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముక్కులో ఆ వెంట్రుకలు ఉండటం ద్వారా వాతావరణంలో ఏర్పడినటువంటి దుమ్ము, ధూళి కణాలను శ్వాస నాళం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించకుండా ఆపుతాయి.

దుమ్ము ధూళి కణాలు శ్వాస నాళం లోకి ప్రవేశించడం ద్వారా ఊపిరితిత్తుల లో అనేక సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లకు కూడా దారితీస్తాయి. అందుకోసమే ముక్కులో వెంట్రుకలను కత్తిరించకుండా, ప్రతి రోజు వాటిని శుభ్రపరుస్తూ ఉండటం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. మనిషికి పరిశుభ్రత ఎంతో అవసరం, కానీ ఆ పరిశుభ్రత ఎక్కువ అయితే అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులుచెబుతున్నారు.

అంతేకాకుండా మన శరీరంలో ఎలాంటి శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఈ వెంట్రుకలు ఆపుతాయి. ముక్కులో వెంట్రుకలను పీకినప్పుడు వాటి కుదుళ్ళు లోఏర్పడిన రంధ్రాలు ద్వారా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ జరిగి రక్త నాళాలలో ప్రవేశిస్తోంది. దీని ద్వారా రక్తం సరఫరా జరిగే సిరుల లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. దీనినే కావర్నస్ సైనస్ థ్రోంబోసిస్ అని పిలుస్తారు. ఇది మెదడుపై అధిక ఒత్తిడిని తీసుకు రావడం వల్ల కొన్నిసార్లు ప్రమాదకరమై మరణానికి కూడా దారి తీస్తుంది ఉంది.