నాగ చైతన్య లైఫ్ లోనే లవ్ స్టోరీ లాంటి సినిమా చేయలేదా..?

మజిలీ బ్లాక్ బస్టర్ తర్వాత అక్కినేని నాగ చైతన్య నుంచి మరో సినిమా రాలేదు. కాస్త గ్యాప్ తీసుకున్న చైతూ మధ్యలో చాలా కథలు విని కూడా నచ్చక కమిటవలేదు. కాని శేఖర్ కమ్ముల నరేట్ చేసిన లవ్ స్టోరీ మాత్రం విపరీతంగా నచ్చి వెంటనే ఒకే చెప్పడం సినిమా పట్టాలెక్కడం చక చకా జరిగిపోయాయి. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయలేకపోయారు.

NC 19 is now Love Story: It looks like an intense and emotional love story  of Naga Chaitanya and Sai Pallavi | Telugu Movie News - Times of India

కాని ఎప్పటి కప్పుడు ఈ సినిమా మీద బజ్ మాత్రం విపరీతంగా పెరుగుతూనే వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రొమాంటిక్ పోస్టర్స్ అండ్ టీజర్ కి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాదు ఈ సినిమా మీద అంచనాలు కూడా భారీగానే నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ క్రమంలో దసరా పండుగ సందర్బంగా సాయి పల్లవి, చైతూ ల పోస్టర్ ను విడుదల చేశారు. శేఖర్ కమ్ముల ఫిదా సినిమా సూపర్ హిట్ తర్వాత మళ్లీ అలాంటి చక్కటి ప్రేమ కథ తో వస్తున్న ఈ సినిమా మీద చైతూ చాలా నమ్మకంగా ఉన్నాడట. అంతేకాదు తన లైఫ్ లోనే ఇలాంటి అద్భుతమైన లవ్ స్టోరీ చేయలేదన్న మాట అంటున్నాడని ఖచ్చితంగా తన కెరీర్ లో చేసే టాప్ టెన్ సినిమాలలో లవ్ స్టోరీ ఉంటుందని ధీమాగా చెబుతున్నాడట.

మొత్తానికి చైతూ అకౌంట్ లో మరో బ్లాక్ బస్టర్ పడబోతుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో నే కాదు ఇండస్ట్రీ వర్గాలలోను బలంగా ఉంది. మరి ఈ సినిమా రిలీజయ్యాక ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.