Born Baby: ఎనిమిది నుంచి పది నెలల పిల్లలు
ఈ నెలల్లో వారికి పాలపళ్ళు వస్తుంటాయి. కనుక మెత్తగా ఉడికిన అన్నం, టమాటో సూపులు, ఉడికించుకున్న కూరగాయలు, పండ్ల గుజ్జులు, పప్పన్నం వంటివి తినిపిస్తూ ఉండవచ్చు.పది నుంచి పన్నెండు నెలల పిల్లలుపుట్టిన బిడ్డకు పది నెలలు నిండిన తరువాత మనం తీసుకునే ఆహారాల్లో చాలా ఆహారాలు వారికీ కూడా ఇవ్వవచ్చు . ఎందుకంటే వారికి అప్పటికి నమిలి అరిగించుకొనే శక్తీ వస్తుంది.ఇడ్లి, హల్వా, దోస,కిచిడి, చిరు ధాన్యాలు, పెరుగన్నం, కూరగాయలు, మెత్తగా చేసిన పండ్లు, అలాగే పండ్ల ముక్కలు మెల్లగా తినిపిస్తూ అలవాటు చేయవచ్చు.
Born Baby: పిల్లల విషయంలో పాటించ వలసిన ముఖ్యమైన జాగ్రత్తలు
పుట్టిన ప్రతి శిశువు ఎవరికి వారే ప్రత్యేకంగా ఉంటారు. ఒకరి పిల్లలు తినేవిధం గా మన పిల్లలు ఆహారం తీసుకోవడం లేదు అని పోల్చుకోకూడదు. కొందరు పిల్లలు ఆహారం మీద ఎక్కువ ఇష్టం చూపరు. అలాంటి వారికీ మెల్లగా ఓపికతో అలవాటు చేయవలిసి ఉంటుంది .ఒకవేళ అజీర్తి సమస్యలు ఏమైనా ఉంటె వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. జిగురుగా ఉండి గొంతులో అడ్డుపడే ఆహారం, గట్టిగా ఉండేటువంటి వాటిని తినకుండా జాగ్రత్త తీసుకోవాలి.
చాలా మంది చంటి పిల్లలకు తేనెని పెడుతుంటారు. తేనె సహజం గా మంచి ఆహారమే అయినా కూడా పిల్లలకు ఒక సంవత్సరం నిండే వరకు తేనె పెట్టకపోవడం మంచిది . తేనె లో ఉండే ఒక విధమైన బాక్టీరియా వల్ల పిల్లలకు ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది.
పిల్లలు పుట్టి 12 నెలలు పూర్తి అయ్యేవరకు ఇంట్లో తయారుచేసిన ఫుడ్ మాత్రమే ఇవ్వాలి . పీచు మరియు మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారం వారికి సరిగా జీర్ణం కాదు అని గమనించాలి. పిల్లలకు ఎట్టి పరిస్థితులలో కూడా మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారం, ఎక్కువ మోతాదులలో చక్కెర నూనె లేదా నెయ్యి వాడి చేసిన తియ్యటి పదార్థాలు, శీతల పానీయాలు షాప్స్ లో కొన్న ఆహారం పెట్టవద్దు. అలాంటివి పెట్టడం వల్ల పిల్లలకి కఫ దోషం, జీర్ణ వ్యవస్థలో ఇన్ఫెక్షన్స్ లు ఇబ్బంది పెట్టవచ్చు. ఎప్పుడు వారికి మీరు ప్రేమ తో శ్రద్ధ గా చేసిన తాజా ఆహారాన్నే పెట్టడం మంచిది.