Silver Foil : కుక్కర్లు: ఇవి మన వంటగదిలో కచ్చితం గా ఉంటాయి. ఇవి అల్యూమినియం తో తయారు చేయడం వలన ఇది మన శరీరంలోకి వెళ్ళి చిత్తవైకల్యం, మతి మరపు వంటి వ్యాధుల ను తీసుకువస్తాయి.
నాన్ స్టిక్ :దీని మీద దోశలు వేయడమంటే మనందరికీ చాలా ఇష్టం. కానీ వాటిల్లో టెఫ్లాన్
అనే రసాయనం ఉండి అది వేడిఅవగానే విషపూరితమైన రసాయనాలు విడుదలవుతాయి. ఈ రసాయనాల తో చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటికి బదులు ఇనుప అట్లా పెనం లేదా సిరామిక్ తో తయారయినది, లేదా మట్టి తో తయారు అయినా వాటిని వాడుకోండి. ఇనుప అట్లా పెనం మీద మొదట దోశలు సరిగా రాకపోవచ్చు. కానీ వేస్తువుంటే చాలాబాగా వస్తాయి.. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది.
4. ప్లాస్టిక్ క్యాన్ : ఇప్పుడు అందరికి ప్లాస్టిక్ వాటర్ క్యాన్ లు లో నీళ్ళు త్రాగడం చాలా సర్వసాధారణం. ఐతే వాటిలోనుండి నీళ్ళుస్టెయిన్ లెస్ స్టీల్ పాత్రల్లోకి పోసుకుని వాడుకోవడం మంచిది. ఇంకా చెప్పాలి అంటే మట్టి కుండలు వాడకం చాలా మంచిది. అంతే తప్ప నీటిని గంటల తరబడి ప్లాస్టిక్ టిన్స్ లో నిల్వ చేసుకుని వాడకండి.
5. అల్యూమినియం ఫాయిల్–వీటిలో ఆహార పదార్థాలని చుట్టి పెడుతుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదం. వీటిబదులు స్టీల్ బాక్సలు వాడటం మంచిది.
6. సబ్బు లేదా లిక్విడ్: గిన్నెలు తోమడానికి బయట దొరికే చాలా సబ్బులలోట్రైక్లోసన్
,ఫాస్ఫేట్
వంటి హానికర రసాయనాలు ఉంటాయి.కాబట్టి వీటిని వాడే బదులు మీరే సొంతగా తయారు చేసుకోవచ్చు.
7. కీటకాల స్ప్రేలు: వీటిల్లో పెర్మెత్రిన్
, సైపర్మెత్రిన్
వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. వీటి వల్ల శ్వాస సంబంధ ఇబ్బందులు, దగ్గు వస్తుంది. వీటి బదులు ఎకో ఫ్రెండ్లీ స్ప్రే లు వాడండి.
8. ఫ్రెషనర్లు : రూమ్స్ కోసం వాడే ఈ ఫ్రెషనర్ ల్లో టోలున్
, జిలీన్
వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. కాబట్టి వీటిబదులు సహజం గా మీరే ఇంట్లో తయారు చేసుకున్నవి వాడుకోండి.
9. వంట ఇంటి ద్రావణాలు: చాలా రకాల కిచెన్ క్లీనర్స్ రసాయనాలతో నింప బడి ఉంటాయి. కాబట్టి వీటిని మీరే ఇంట్లో తయారు చేసుకోండి.
మీ వంటగదిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇవి కొన్ని మార్గాలు. కాస్త సమయం తీసుకుని అలోచించి దాన్ని రసాయన రహితం చేసి మీ ఆత్మీయుల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.