NewsOrbit
హెల్త్

ladies Health: మీ గర్ల్ ఫ్రెండ్ పీరియాడ్స్ లో ఉందా .. ఈ విషయం ఆమెకి వెంటనే చెప్పండి , లేదంటే తరవాత బాధపడతారు !

ladies Health: మెన్సెస్  మొదలైన నాటి నుంచి  నెల నెలా ఓ ఐదు లేదా ఆరు రోజుల పాటు అసౌకర్యంగా, అసహనంగా, చిరాగ్గా,   ఉంటుంది.   అయినా  కూడా పీరియడ్స్ విషయంలో కచ్చితంగా మనం పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి.  వాటి గురించి కూడా తెలుసుకుందాం.నెలసరి సమయంలో వాష్రూమ్ ఉపయోగించిన తర్వాత.. ఎక్కడ బ్లడ్  మరకలు లేకుండా  చూసుకోవాలి.  టాయిలెట్ సీట్ మీద బ్లడ్  ఏమైనా  ఉందేమో  ఒకటికి రెండుసార్లు చెక్  చేసుకుని బయటకు రావాలి. అలాగే ఆ సమయంలో తుడుచుకున్న  తర్వాత బ్లడ్ అంటిన టాయిలెట్ పేపర్లను జాగ్రత్తగా చుట్టి మరకలు పైకి కనిపించకుండా  డస్ట్ బిన్ లో వేయండి.  అందరికీ  పీరియడ్స్ వస్తాయి.  అయినా  ఇతరుల మెనుస్ట్రువల్ బ్లడ్‌ను చూడటానికి  కాస్త బెరుకుగానే ఉంటుంది కదా. అందుకే ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

వాడేసిన తర్వాత  టాంఫూన్లను,  శానిటరీ న్యాప్కిన్లు  కమోడ్‌లోవేసి ఫ్లష్ చేయడం  వల్ల అది డ్రెయిన్ పైపుల్లో ప్రవాహానికి  అడ్డుపడుతుంటాయి. మళ్లీ దీనికి ప్లంబింగ్ వర్క్ చేయాలంటే..ఖరీదుతో కూడుకున్న  పని అనే చెప్పాలి.   కాబట్టి మీరు ఉపయోగించిన ప్యాడ్ లేదా టాంఫూన్లను ఇకపై ఫ్లష్  చేయకండి . మీకు జరిగే  రక్తస్రావాన్ని బట్టి  నాలుగు నుంచి ఆరు గంటలకోసారి మీ ప్యాడ్ లేదా టాంపూన్లు  మార్చుకోవడం మంచిది.  ఎక్కువ రక్తస్రావం జరుగుతుంటే  నాలుగు గంటలకోసారి, తక్కువగా జరుగుతుంటే ఆరు గంటలకోసారి మార్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ సమయం ప్యాడ్ మార్చకుండా  ఉంచేసుకుంటే  మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, ర్యాష్ రావడానికి కారణం అవుతుంది. కొన్నిసార్లు ఇది టాక్సిక్ షాక్ సిండ్రోమ్‌కు కూడా  దారి తీస్తుంటుంది. అది ప్రాణాంతకం కూడా కావచ్చు .

వెజీనా సహజంగానే తనంతట తానూ అనారోగ్యాన్ని కలిగించే బ్యాక్టీరియా ను బయటకు పంపించేస్తుంది.    నెలసరి  సమయంలో  ఎప్పటికప్పుడు వెజీనా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం సబ్బు వంటివి వాడకూడదు .  కానీ  వేడి నీటితో శుభ్రం చేసుకుంటే  మంచిది.  అదే సబ్బు వాడటం వలన అక్కడ ఉన్న మంచి బ్యాక్టీరియాను సైతం సబ్బు నాశనం చేస్తుంది. శుభ్రం చేసుకునేటప్పుడు వెనక నుంచి ముందుకు చేయకుండా ముందు నుంచి వెనక కు  శుభ్రం చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా  ఉంటుంది.

కొన్ని హోటల్స్,మాల్స్, ఆఫీస్ లో శానిటరీ న్యాప్కిన్ ను పడేయడానికి ప్రత్యేకంగా డస్ట్ బిన్ ను ఏర్పాటు చేస్తుంటారు.  ఒకవేళ దాని కోసం ప్రత్యేకంగా డస్ట్ బిన్లు   ఉన్నా లేకపోయినా, న్యాప్కిన్ డస్ట్ బిన్ లో వేసే ముందు దాన్ని రేపర్ లో పెట్టి గుండ్రంగా చుట్టి పడేయండి. దీని కోసం ప్యాడ్‌కి ఉన్న ప్యాకేజింగ్ రేపర్ఉపయోగించిన సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఈ రేపర్ లేకపోతే టాయిలెట్ పేపర్ లేదా పేపర్  ను వాడుకోవచ్చు. టాంఫూన్ కూడా ఇలాగే పేపర్ లో చుట్టి పడేయాలి  తప్ప  శానిటరీ వేస్ట్‌ను ఎట్టి పరిస్థితులలో కూడా ఫ్లష్ చేయద్దు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri