ఇంటి వద్ద ఫిట్ నెస్ కోసం రోజు వ్యాయామం చేయాలనుకుంటే, ముందుగా ఫిట్నెస్ ట్రైనర్‌ని సంప్రదించండి. ఈ వ్యాయామ దినచర్య లో జంపింగ్ జాక్, స్క్వాట్స్, పుష్-అప్స్, ప్లాంక్ వంటి సాధారణ వ్యాయామాలు ఉంటాయి. వైవిధ్యా పరికరాలు లేకుండా కూడా మంచి వ్యాయామాలు చేయొచ్చు.
వ్యాయామం చేసే ముందు నెమ్మదిగా శరీరాన్ని సన్నాహం చేయటం కోసం జాగింగ్, మార్చింగ్ చేయడం మంచిది. కార్డియో వ్యాయామాలు ఆరోగ్యానికి మంచిది. శరీర బరువు తగ్గించుకోవాలి అనుకునే వారు కార్డియో వ్యాయామాలను తప్పక చేయాలి. వీటి వలన ఉదరభాగం, తొడలు, పిరుదుల వద్ద ఉండే కొవ్వు పదార్థాలు కరిగించబడతాయి..స్క్వాట్స్ వ్యాయామం వల్ల మీరు బలమైన శరీరాన్ని పొందుతారు, జీర్ణవ్యవస్థ మెరుగుపరచడం తో పాటు మోకాలి కీళ్ళను దృఢపరుస్తాయి. ఇంకా మీ శరీరంలోని హార్మోన్ల స్థాయిని పెంచుతాయి. ముఖ్యంగా స్క్వాట్స్ అమ్మాయిలకు గొప్ప వ్యాయామం. పుష్ అప్స్ వల్ల శరీరంలోని మజిల్స్ చురుగ్గా మారుతాయి. ఇది శరీరమంతటికి వ్యాయామం అందిస్తుంది. బరువు తగ్గించేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
వాకింగ్ లంజస్ వ్యాయామం వల్ల మీ పొట్ట దగ్గిర కండరాలు బలంగా మారతాయి. ఇది తొడ దగ్గర కొవ్వు, వీపు కింది భాగంలో పేరుకున్న కొవ్వును కరిగించటానికి చాలా మంచి వ్యాయామం. 15 సెకండ్ ప్లాంక్ శరీరంలో పేరుకున్న, కొవ్వును కరిగిస్తాయి. పొత్తికడుపు, తొడల కొవ్వును సహజంగా కరిగించే మంచి వ్యాయామాలలో ఇది ఒక వ్యాయామం. ఇవి చేయటం చాలా కష్టం, కానీ ఈ వ్యాయామం, పొట్టలోని కండరాలను బలపడేలాచేస్తాయి. గెంతడాన్ని జంపింగ్ జాక్స్ అంటారు. గుండెకు మేలు చేసే సులువైన వ్యాయామం జంపింగ్ జాక్స్. ఈ వ్యాయామం వల్ల మీ పిక్కల వద్ద కండరాలు డెల్టాయిడ్ కండరాలు, టోన్ చేయబడతాయి. ఈ వ్యాయామం వల్ల మీ గుండె కొట్టుకునే వేగం పెరిగి మీలో ఉత్సాహం నిండుతుంది.