లవంగాలు ఈ పేరు వింటేనే కొందరికి నచ్చదు. సాధారణంగా మన వంటల్లో వేసినప్పుడు, లవంగాలు వస్తే తినకుండా చాలామంది పడేస్తూ ఉంటారు. కానీ లవంగాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. లవంగాలు మంచి వాసనే కాకుండా చక్కని రుచిని కూడా కలిగి ఉంటాయి. ప్రతిరోజు ఒక కప్పు లవంగం టీ తాగడం వల్ల, లేదా రాత్రి పడుకునే సమయంలో ఒకటి లవంగం నమిలి తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. లవంగాల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత లవంగం నమిలి తినడం వల్ల జీర్ణక్రియ రేటు మెరుగ్గా ఉంటుంది. జీర్ణాశయం, ప్రేగులు శుభ్రపడతాయి. గ్యాస్ అసిడిటీ, వికారం, అజీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. మనం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అవ్వడమే కాకుండా, మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది అనేక సూక్ష్మ జీవుల ఇన్ఫెక్షన్ల బారి నుంచి శరీరాన్ని రక్షించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
లవంగాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ను శుద్ధి చేసి, మన శరీరంలో మెటబాలిజం రేటును మెరుగుపరుస్తుంది. దీంతో మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె సమస్యల నుండి దూరం చేస్తుంది. లవంగాల షుగర్ వ్యాధిగ్రస్తుల పట్ల ఒక వరంగా భావించవచ్చు. లవంగాలలో ఉండే ఇన్సులిన్ వంటి సుగుణాలు, రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.
ప్రతిరోజు ఉదయం కొద్దిగా లవంగాల పొడి తీసుకుని బాగా నీటిలో మరిగించి ఆ నీటిని వడబోసి, అందులో తేనె కలుపుకొని తాగడం వల్ల దంతాలు, చిగుళ్ల నొప్పులు తగ్గుతాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియా లు నశించిపోయి, నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న లవంగాలను ప్రతి రోజు తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరిచేరవు.