లడ్డూలలో మోతీచూర్ లడ్డు చాలా ఫేమస్.. అదేనండి సన్నపూసలడు.. ఈ లడ్డు ఒక్కసారి రుచి చూస్తే ఇదే లడ్డు కావాలి అంటాం.. ఇంతకీ ఈ లడ్డూను బయట స్వీట్స్ షాప్స్ లో దొరికే వాటికంటే రుచికరంగా హెల్తీగా కూడా మన ఇంట్లోనే చేసుకోవచ్చు..! ఈ మోతీచూర్ లడ్డు తయారీ విధానం.. కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
మోతీచూర్ లడ్డు తయారీ విధానం..
కావలసిన పదార్థాలు శనగపిండి రెండు కప్పులు, రెండు కప్పు నీళ్లు, పంచదార రెండు కప్పులు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా , ఎల్లో ఫుడ్ కలర్ చిటికెడు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి ఒక చెంచా..
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో శెనగపిండిని వేసి చిటికెడు ఉప్పు కూడా వేసి కలపాలి.. ఇందులో తగినన్ని నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు ఒక పొయ్యి మీద బాండీ పెట్టుకుని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి.. మరొక పొయ్యి మీద పంచదార నీళ్లు పోసి తీగ పాకం వచ్చేవరకు పట్టుకోవాలి..
నూనె కాగిన తర్వాత సన్న బూందీ వేసే గరిటలో ముందుగా సిద్ధం చేసుకున్న శెనగపిండిని అందులో వేసుకొని బూందీ వేసుకోవాలి. బూందీ వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని బూందీ లగా వేసుకావాలి.. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సిద్ధం చేసుకున్న బూందీ వేసుకుని సన్నగా తరిగిన జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నాలుగు చెంచాల నెయ్యిని వేసి ఆ పైన వేడి వేడిగా ఉన్న పంచదార పాకాన్ని పోయాలి. స్పూన్ సాయంతో వీటన్నింటినీ కలిపి తిప్పుకోవాలి.. ఒక మూడు నిమిషాల పాటు వదిలేస్తే బూంది మొత్తం ఆ పంచదార పాకాన్ని పీల్చుకుంటుంది. కాస్త వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు లాగా చుట్టుకోవాలి. అంతే మోతీచూర్ లడ్డు తినటానికి రెడీ.. ఇలా సిద్ధం చేసుకున్న లడ్డు 15 రోజులపాటు నిల్వ ఉంటాయి..