మనిషికి శృంగార కోర్కెలు ఆ వయ్యస్సులోనే… మొదలవుతాయా ??

శృంగారం పరమైన ఆలోచనలు ఆసక్తి యవ్వన దశలోనే  కలుగుతాయి  అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే… నిజానికి ఆ భావనలు  పసి వయసు నుంచే ప్రారంభం అవుతాయి అని  నిపుణులుచెబుతున్నారు.తల్లితండ్రి ఒకరితో ఒకరు ప్రేమగా ఉండడం చుసిన పిల్లలు పెద్దయ్యక  అంతే ప్రేమగా ఉంటారు. తల్లి తండ్రి ఎప్పుడు దెబ్బలాడుకోవడం ఎడమొహం తో ఉండడం చూసిన పిల్లలు పెద్ద అయ్యాక దురుసు ప్రవర్తన తోనే ఉంటారు అని నిపుణులు చెబుతున్నారు .

మనిషికి శృంగార కోర్కెలు ఆ వయ్యస్సులోనే… మొదలవుతాయా ??

అందుకే పిల్లలకు చిన్న తనం నుంచే నిజమైన ప్రేమను పరిచయం చేయాలి. చిన్నపిల్లలు తమ శరీరంలోని ఇతర  భాగాలను తాకినట్లుగానే జననాంగాల ను తాకుతూ ఉంటారు. అందులో పెద్దగా తప్పేమీ లేక పోయిన  కానీ… ఇంట్లో ఉండే పెద్దలు మాత్రం వారిని అదో పెద్ద నేరం చేసినవారిలా చూస్తారు. ఛీ.. అక్కడ చేతులు పెట్టొద్దంటూ వారిని వారిస్తారు. మనం పెద్దగా పట్టించుకోని ఈ విషయం… పిల్లల మనసుపై బలంగా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలు యుక్త వయ్యస్సుకు  రాగానే..వారి జనానాంగాల గురించి పెద్దవారు ఎంతో కొంత అవగాహన కల్పించాలని   నిపుణులు సూచిస్తున్నారు. యుక్త వయసు లో అడుగు పెట్టే సమయం లో పిల్లల్లో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులుకలుగుతూ ఉంటాయి . కానీ మన సమాజంలో మాత్రం ఈ మార్పుల గురించి పిల్లలకు వివరించి  వారిని  సన్నద్ధం చేయడం లేదు. దీని వల్ల వారి శరీరంలో జరిగే మార్పులకు కొందరు పిల్లలు భయపడే అవకాశం ఎక్కువ అనే చెప్పాలి. అప్పటి వరకు మల, మూత్ర విసర్జన మాత్రమే తెలిసిన పిల్లలకు యుక్తవయసు లో కి రాగానే  ఆడపిల్లల్లో రక్త స్రావం, మగపిల్లలల్లో అంగం నుంచి తెల్లటి స్రావం రావడం లాంటివి జరుగుతాయి.

వాళ్లు ఆ దశకు చేరుకుంటున్నారు అనగానే… పిల్లలకు మీ వయ్యస్సులో ఇలా జరిగే అవకాశం ఉందని పెద్దలు ముందుగానే వివరించాలి అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు నిద్ర లేచే సరికి అబ్బాయిలకు అంగం గట్టిపడటం జననాంగాల వద్ద రోమాలు రావడం వంటివి జరగవచ్చని…. ఇవన్నీ ముందే చెప్పి వారిని సన్నద్ధం చేస్తే భవిష్యత్తులో వారు ఏదోదో ఊహించుకొని అనుమానపడి భయపడే అవకాశం ఉండదు.యుక్త వయ్యస్సులోకి రాబోతున్న పిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రి వారికీ వివరంగా చెప్పి వారి భయాలను పోగొట్టవలిసిన అవసరం ఎంతయినా ఉంది అని గమనించాలి.