Food: పెసలు ఉడికించి తినటం లేదా మొలకెత్తిన వి తీసుకోవడం ,లేదంటే పెసరట్టు ద్వారా అయినా కూడా పెసలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పెసలను తింటే , శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం గుండె సమస్యల ను దూరం చేస్తుంది.పెసలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన, ఇవి మన శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరును పెంచి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. దీని వల్ల మనకు వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.
పెసలను ఆహారం లో తీసుకుంటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీనివలన అధిక బరువు కూడా తగ్గుతుంది . గుండె జబ్బులు కూడా రావు. పెసల్లో మెగ్నిషియం, పొటాషియం, అధికం గా ఉండడం వల్ల రక్త సరఫరా బాగాజరుగుతుంది. హైబీపీ తగ్గించుకోవచ్చు. షుగరు ఉన్నవారు పెసలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవటం వలన, షుగర్ అదుపు లో ఉంటుంది. ప్రెగ్నెంట్స్ తరచూ పెసలను తింటే ఫోలేట్ బాగా అంది బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. పెసలతో పెసరట్టు చేసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది కాబట్టి , వారానికి రెండు సార్లైనా పెసరట్టు తినాలని న్యూట్రీషియన్స్ సూచిస్తున్నారు.
పెసలు ఆహారంగా తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత బాగుంటుంది. తలనొప్పి,కండరాల నొప్పి, నీరసాన్ని తగ్గించే గుణం పెసలకు ఉంది ఉంది.
రోజు వారి ఆహారంలో పెసలు చేర్చుకోవడం వల్ల శరీరంలోని అనవసరమైన కెమికల్స్ తొలగించబడతాయి.కంటిచూపు సమస్యలు రావు.పెసల లో ఉండే పుష్కలమైనటువంటి ప్రోటీన్లు మరియు న్యూట్రీషియన్స్ ఆరోగ్యకరమైన జుట్టు ను ఇస్తాయి.ఐరన్ లోపం ఉన్నవారు, రోజువారీ ఆహారంలో పెసలు తీసుకుంటే సమస్య తగ్గుతుంది.