Rainy Season: ఎండల నుంచి సేద తీర్చడానికి వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలం లో వాన నీరు , వరద ప్రవాహాలు కనిపిస్తుంటాయి. వర్షాకాలం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం గా ఉన్న ఎన్నో రకాల వ్యాధులు చాలా తేలికగా వచ్చేస్తాయి . అలాంటి ప్రమాదకరమైన ఒక వ్యాధి మరియు దాని నివారణ గురించి తెలుసుకుందాం
వర్షపు నీరు రకరకాల ప్రదేశాల నుంచి ప్రవహిస్తూ వచ్చి రోడ్లమీద నిలిచిపోతుంది. ఇలాంటి కలుషితమైన వాన నీటిలో నడిస్తే ప్రమాదకరమైన లెప్టోస్పీరోసీస్ అనే వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వ్యాధి సోకినవారు 24 నుంచి 72 గంటల వ్యవధిలో డాక్టర్ను సంప్రదించాలని తెలియచేస్తున్నారు. నిల్వ ఉన్న వర్షపు నీటిలో లెప్టోప్ అనే బ్యాక్టీరియా ఉంటుంది.దీని నుంచి లెప్టోస్పీరోసీస్ అనే వ్యాధి పుట్టి వ్యాప్తి చెందుతుంది. వాన నీటిలో ఎలుకలు, కుక్కలు, గేదెలతో పాటు వివిధ రకాల జంతువుల యూరిన్ కలిసి ఉంటుంది ఎవరైనా ఇలాంటి నీటిలో నడిస్తే ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ బ్యాక్టీరియా చర్మం పై పొర నుంచి శరీరంలోకి.. ఆ తర్వాత రక్తం లోకి చేరుతుంది.ప్రధానంగా ఏదైనా కారణం చేత కాళ్లకు గాయాలైన వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ శాతం ఉంటుంది.లెప్టోస్పీరోసీస్ వ్యాధి బారిన పడిన వారు.. వెంటనే డాక్టర్ను సంప్రదించకుండా.. నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన గర్భిణీలు, 8 ఏళ్ల లోపు చిన్నారుల డాక్టర్ సలహాలు పాటిస్తూ తగిన మందులు వాడాలి. ఇది అంటువ్యాధి కాకపోవడం ఊరటనిచ్చే అంశం గా చెప్పుకోవచ్చు.