అందరూ ఇష్టపడే స్వీట్స్ లో గులాబ్ జామున్ కూడా ఒకటి.. ఈ స్వీట్ ను అందరూ ఇళ్లల్లో చేసుకుంటారు.. ఒక్కొక్కసారి గులాబ్ జాము తినాలని అనిపిస్తుంది.. సమయానికి ఇంట్లో ఇనిస్టెంట్ మిక్స్ ఉండకపోవచ్చు.. అలాంటప్పుడు బొంబాయి రవ్వ తో కూడా గులాబ్ జామ్ చేసుకోవచ్చు.. అలా ఎలా తయారు చేసుకోవచ్చో..!? అందుకు కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!
బొంబాయి రవ్వతో గులాబ్ జామ్ తయారీకి కావలసిన పదార్థాలు.. ఒక కప్పు బొంబాయి రవ్వ, రెండు కప్పులు పంచదార, రెండు కప్పులు నీళ్లు, ఒక చెంచా నెయ్యి, యాలకుల పొడి కొద్దిగా, పాలు రెండున్నర కప్పులు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా..
ముందుగా ఒక స్టవ్ వెలిగించి పాన్ పెట్టీ అందులో నెయ్యి వేడయ్యాక బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు మరొక గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి.. ఈ పాలలో బొంబాయి రవ్వ వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి.. మిశ్రమం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక ప్లేట్ లోకి దీనిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి..
పొయ్యి మీద ఒక గిన్నెలో నీళ్లు, పంచదార వేసి పాకం వచ్చేదాకా మరిగించాలి.. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులో నూనె పోసి బాగా కాగనివ్వాలి.. నూనె వేడయ్యాక అందులో ముందుగా సిద్ధం చేసుకున్న బొంబాయి రవ్వ ఉండలను వేసి దోరగా వేయించాలి.. ఈ ఉండలను పంచదార పాకంలో వేయాలి.. అంతే తినడానికి గులాబ్ జామున్ రెడీ..