Taliban: హిందూ పూజారి చేసిన ప‌నికి షాక్ తిన్న తాలీబాన్లు…

Afghanistan Taliban Crises: Major Effect to India soon?
Share

Taliban: ఆఫ్ఘనిస్తాన్‌ లో సంచ‌ల‌న ప‌రిణామాల‌తో అధికారంలోకి వచ్చిన తాలిబన్ల గురించి ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతున్నది. ఇక ఆ దేశం నుంచి వచ్చేందుకు జనాలు ఎయిర్ పోర్టులకు ఎగబడుతున్నారు. మరోపక్క లక్షలాది మంది ప్రజలు భయాందోళనతో దేశాన్ని విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆ దేశంలో ఉన్న వేలాది హిందువులు, సిక్కులు, భారతీయుల భద్రతపై ఆందోళన మొదలైంది. ఇక్కడకు వచ్చేందుకు మన దేశ, రాష్ట్ర ప్రభుత్వాలను వారు వేడుకుంటున్నారు. అయితే, ఓ పూజారి వారికి షాకిచ్చారు.

Read More: afghanistan: ఆప్ఘ‌నిస్తాన్ అధ్య‌క్షుడిగా మ‌ళ్లీ ఘ‌నీ… అస‌లు ట్విస్ట్ ఏంటంటే..

హిందూ పూజారి సంచ‌ల‌న‌…
లక్షలాది మంది ఆఫ్గన్లు ఇతర దేశాల్లో తలదాచుకోవడానికి ప్రాణాలను లెక్కచేయకుండా తరలి వెళుతున్నారు. ఓ హిందూ పూజారి మాత్రం తనకేం భయం లేదని చెబుతున్నాడు. కాబుల్ లోని రత్తన్ నాథ్ ఆలయంలో పండిట్ రాజేష్ కుమార్ పూజారిగా ఉన్నారు. తాలిబన్లు కాబుల్ ని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పూజారిని ఆలయాన్ని విడిచి తమతో రావాలని పిలిచారు. కానీ ఆయన మాత్రం వాళ్ల ప్రతిపాదనకు ససేమిరా అన్నారు. వందల ఏండ్లుగా తమ పూర్వీకులు ఇక్కడే ఉంటూ రత్తన్ నాథ్ ఆలయ బాగోగులు చూసుకున్నారని.. ఇప్పుడు ఈ గుడిని వదిలేసి తను ఎక్కడికి వెళ్లనని చెబుతున్నాడు. ఒక వేళ తనను తాలిబన్లు చంపినా అది దేవుడి సేవగానే భావిస్తానని.. అంతేకాని దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడని ఇండియాకు తిరిగొచ్చిన కొందరు చెప్పడం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.

Read more : afghanistan: ఆప్ఘ‌నిస్తాన్ అధ్య‌క్షుడిగా మ‌ళ్లీ ఘ‌నీ… అస‌లు ట్విస్ట్ ఏంటంటే..


భ‌యం లేదంటున్న తాలీబాన్లు
తాలిబన్ల చేతుల్లోకి కాబూల్ వెళ్లడంతో ఓ గురుద్వార్ లోని ఆశ్రయంలో దాదాపుగా మూడువందల మంది సిక్కులు, హిందువులు ఆశ్రయం పొందుతున్నారు. వారి జాడను తెలుసుకున్న తాలిబన్లు.. వారితో చర్చలు జరిపారు. వారి భద్రతకు భరోసా ఇస్తామని చెప్పారు. ఈ చర్చల్లో తాలిబన్ పెద్ద స్థాయి నాయకులు పాల్గొని హిందువులు, సిక్కుల భద్రతకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయాన్ని అకాలీదళ్ ప్రతినిధి, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు అయిన మంజీందర్ సింగ్ సిర్సా ట్వీట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో రాజకీయ, సైనిక మార్పులు దారుణంగా ఉన్నా.. అక్కడ హిందువులు, సిక్కులు సురక్షితంగా జీవిస్తారని తాము బలంగా నమ్ముతున్నట్టు ఆయన వివరించారు.


Share

Related posts

Corona :కరోనా వ్యాక్సిన్ విషయంలో డబ్ల్యూహెచ్ఓ కీలక ఆదేశాలు.!

sekhar

విజయతీరానికేనా నడక!

Siva Prasad

దమ్మలపాటి నుండి రక్షణ కల్పించండి..! ఎస్పీని కలిసిన పిర్యాదుదారుడు..!

Special Bureau