NewsOrbit
జాతీయం

Supreme Court: దేశవ్యాప్తంగా బాణాసంచా కాల్చడం నిషేధం అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!!

Supreme Court: భారతదేశంలో అతిపెద్ద పండుగలో ఒకటి దీపావళి. మరో మూడు రోజులలో ఈ పండుగ రాబోతున్న క్రమంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఊహించని షాక్ ఇవ్వటం జరిగింది. దేశంలో కాలుష్యం పెరుగుతుంది అంటూ బాణాసంచా నిషేధంపై రాజస్థాన్ కి చెందిన పిటీషనర్ వేసిన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. దీపావళి వేడుకలలో బాణాసంచా పై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కేవలం ఢిల్లీకి పరిమితం అనుకుంటున్నారని పిటిషినర్ తెలిపారు. ఇదే సమయంలో ఈ తీర్పు దేశమంతటా వర్తిస్తుందని అందరికీ తెలియజేయాలని కోరడం జరిగింది. అంతేకాకుండా ఆసుపత్రులు.. పాఠశాలలు వంటి ప్రాంతాలలో బాణాసంచా వినియోగం లేకుండా నిషేధం విధించాలని పిటిషినర్ కోరడం జరిగింది.

Banning fireworks across the country is a key order of the Supreme Court for all states

ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన పిటిషన్లను న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా దేశంలో కాలుష్యం పెరుగుతూ ఉండటంతో ఢిల్లీ బాణాసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ రాష్ట్రానికి న్యాయస్థానం సూచించింది. బాణాసంచాలో అనేక నిషేధిత రసాయనాలు వాడకానికి వ్యతిరేకంగా గతంలో ఢిల్లీ ప్రభుత్వానికి జారీ చేసిన ఆదేశాలు దేశమంతట వర్తిస్తాయని స్పష్టం చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్క కోర్టుల బాధ్యత మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరీ బాధ్యత అని సుప్రీం పేర్కొంది.

Banning fireworks across the country is a key order of the Supreme Court for all states

అలాగే ప్రజలను చైతన్యవంతులను చేయడమే కీలకమనీ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే సమయంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో తక్షణమే పంట వ్యర్ధాలు కాల్చివేతని కూడా నిలిపివేయాలని సుప్రీం ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఈ విషయంలో బుధవారం ఢిల్లీతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రతినిధులు సమావేశం అయ్యి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలలో స్పష్టం చేయడం జరిగింది. కాగా దీపావళి పండుగ సమీపిస్తున్న సమయంలో సుప్రీం తీసుకున్న తాజా నిర్ణయం పై సోషల్ మీడియాలో నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భారతదేశంలో ఎప్పటినుండో ఆనవాయితీగా జరుపుకునే దీపావళి పండుగపై ఇలాంటి ఆంక్షలు పెట్టడం దారుణం అని కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతకు జైల్ అధికారులు షాక్ .. ములాఖత్‌కు అనుమతి నిరాకరణ..! ఎందుకంటే..?

sharma somaraju

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju