NewsOrbit
జాతీయం న్యూస్

Delhi Murder Case: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన .. అందరూ చూస్తుండగానే బాలికపై యువకుడు పాశవికంగా దాడి

murder in delhi 16 year old girl stabbed to death by boyfriend in Shahabad dairy area

Delhi Murder Case: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే 16 ఏళ్ల బాలికపై ఓ యువకుడు (20) విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి 20సార్లు పొడిచాడు. అంతటితో ఆగకుండా పెద్ద బండరాయితో బాలిక తలపై పలు సార్లు మోదాడు. ఇంత ఘోరం జరుగుతున్నా అక్కడ ఉన్న వారు ఎవరూ నిలువరించకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ రోహిణి ప్రాంతంలోని షహబాద్ లో 16 ఏళ్ల బాలిక నివసిస్తొంది, సాహిల్ అనే 20 ఏళ్ల యువకుడితో బాలిక స్నేహంగా ఉంటోంది. ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.

murder in delhi 16 year old girl stabbed to death by boyfriend in Shahabad dairy area
murder in delhi 16 year old girl stabbed to death by boyfriend in Shahabad dairy area

 

ఈ క్రమంలో ఆదివారం తన స్నేహితురాలి కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లడానికి ఆమె ఇంటి నుండి బయటకు వచ్చింది. అదే సమయంలో ఆమెను అడ్డగించిన నిందితుడు బాలికపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఏకంగా 20 సార్లు కత్తితో పొడిచాడు. ఒక నొక దశలో బాధితురాలి తలలో కత్తి ఇరుక్కుపోయేంతగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఓ బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం ఆమె ఫోన్ నుండి వారిద్దరి మధ్య జరిగిన వాట్సప్ ఛాట్ మెసేజ్ లను తొలగించాడు. అనంతరం ఘటనా స్థలం నుండి నిందితుడు పారిపోయాడు.

ఇంత ఘోరం కళ్లముందు జరుగుతున్నా చుట్టుపక్కల వారు ఎవరూ నిందితుడిని ఆపే ప్రయత్నం చేయలేదు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను పరిశీలించి నిందితుడు సాహిల్ గా గుర్తించారు. అయితే బాధితురాలు, సాయిల్ ప్రేమించుకున్నాడని సమాచారం. అమ్మాయితో గొడవపడిన అనంతరం నిందితుడు ఇంతటి ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తొంది. 18 గంటల అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాలి స్పందించారు. ఢిల్లీలో మైనర్ బాలికను బహిరంగంగా హత్య చేయడంపై అరవింద్ కేజ్రీవాల్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నేరస్తులు నిర్బయంగా ఉన్నారనీ, పోలీసులంటే కనీస భయం కూడా లేదని, లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ సార్.. మీరే చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాలి మాట్లాడుతూ .. ఢిల్లీలో బాలికలు, మహిళలకు భద్రత లేకుండా పోయిందని వాపోయారు. 16 ఏళ్ల బాలికపై కత్తితో దారుణంగా పొడిచారని, ఆ పై బండరాయితో అనేక మార్లు కొట్టి చంపారన్నారు. నేరస్తులను కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా భయపడటం లేదన్నారు.

చంద్రబాబుపై మరో సారి కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju