NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Parliament Special Session: ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు .. ఏపీ, తెలంగాణ విభజనపై మోడీ కీలక వ్యాఖ్యలు

Advertisements
Share

Parliament Special Session: దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్ సభ ఆరంభమైంది. బీజేపీ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నది..? ఏమేం బిల్లులు తీసుకురాబోతున్నది..? అనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయం తక్కువగానే ఉండొచ్చు కానీ చారిత్రాత్మకం కాబోతుందని వ్యాఖ్యానించారు మోడీ.  అనేక కారణాల వల్ల చాలా చరిత్రలో నిలవబోతుందన్నారు.

Advertisements

విశ్వాసం, ఉత్సహంతో ఈ సెషన్ ఉంటుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం అవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్ ఆశాకిరణంగా మారిందన్నారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లు మోడీ వెల్లడించారు. ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్ పయనిస్తొందని అన్నారు. చాలా ముఖ్యమైన ఈ ప్రత్యేక సమావేశాలకు సభ్యులందరూ హజరు కావాలని కోరుతున్నానన్నారు. ఏడుపులు, విమర్శలకు ఇది సమయం కాదంటూ విమర్శించారు. విశ్వాసం, సానుకూల దృక్పదంతో వీటిని నిర్వహిస్తున్నామనీ, సభ్యులంతా ఉత్సాహంగా చర్చల్లో పాల్గొంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

Advertisements

నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో రెండు రోజుల అజెండా మాత్రమే ఇవ్వడంతో మిగతా మూడు రోజుల్లో ఏదైనా సర్ ప్రైజ్ ఉంటుందేమో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రత్యేక సమావేశాల తొలి రోజు పార్లమెంట్ కార్యకలపాల పాత పార్లమెంట్ హౌస్ లో ప్రారంభం కాగా.. మరుసటి రోజు (రేపటి) నుండి కొత్త పార్లమెంట్ హౌస్ లో జరగనున్నాయి. అయిదు రోజుల ప్రత్యేక సమావేశాల్లో మొదటి రోజు పార్లమెంట్ 75 ఏళ్ల ప్రయాణంపై చర్చ జరుగుతోంది. 75 ఏళ్ల పార్లమెంట్ ప్రమాణంలో సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు చర్చించనుండగా, ప్రధాని మోడీ ప్రసంగించి చర్చను ప్రారంభించారు. రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు కొత్త భవనంలో జరగనున్న నేపథ్యంలో పాత భవనంతో జ్ఞాపకాలను మోడీ గుర్తు చేసుకున్నారు.

ఇదే సందర్భంలో ఏపీ, తెలంగాణ విభజన పై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వంటి పలు రాష్ట్రాల ఏర్పాటుకు ఈ భవనం వేదికైందని అన్నారు. అయితే యూపీఏ హయాంలో ఏపీ విభజన సరిగా జరగలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనలో ఏపీ, తెలంగాణ ఇరు వర్గాలు అసంతృప్తికి గురయ్యారని మోడీ అన్నారు. ఈ చారిత్రక భవనం నుండి మనం వీడ్కోలు తీసుకుంటున్నామన్నారు. స్వాతంత్ర్యానికి ముందు  ఈ భవనం ఇంపీరియల్ లెజిస్లేచర్ కౌన్సిల్ గా ఉండేదనీ, చారిత్రక ఘట్టాలకు వేదిక అయ్యిందన్నారు. మనం కొత్త భవనంలోకి వెళ్లినా, పాత భవనం మనకు నిరంతర ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ సమావేశాల్లో పోస్టాఫీసు బిల్లు 2023, ప్రధాన ఎన్నికల కమిషనర్, మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి బిల్లులను కూడా ప్రవేశపెట్టనున్నారు.

AP CID:  ‘స్కిల్ స్కామ్ లో ప్రధాన కుట్రదారుడు చంద్రబాబే’


Share
Advertisements

Related posts

ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పణ

somaraju sharma

Mahesh: మహేశ్ ఫ్యాన్స్..మీకు బంగారం శుభవార్త…

GRK

Karthika deepam: ఈరోజుటి ‘కార్తీక దీపం’ ఎపిసోడ్ లో జరిగేది ఇదే, అంబులెన్స్ లో శ్రీవల్లి!

Ram