Krishna Mukunda Murari: రేవతి ముకుంద దగ్గరకు వచ్చి ఆదర్శ్ పేరు చెప్పి మురారి మీద ప్రేమ చూపించాలి అని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది. కానీ ఆయన అంటే నా దృష్టిలో మురారినే అని ముకుందా అనగానే.. ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గు లేదా అని రేవతి అంటుంది. కృష్ణని మోసం చేస్తున్నానని అనిపించడం లేదా అని రేవతి అడగగానే లేదు అని ముకుందా అంటుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి ఇన్నాళ్లు కృష్ణ మురారిలు ఇద్దరు వాళ్లది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పకుండా మనల్ని మోసం చేశారు కదా అని ముకుందా అడుగుతుంది. వాళ్ళిద్దరూ మోసం చేసినప్పుడు నేనెందుకు తగ్గాలి. కృష్ణ ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి. ఆదర్శ్ ఈ ఇంటికి రాకూడదు. ముకుందా వెడ్స్ మురారి ఇదే నా ఎజెండా అని ముకుందా కుండ బద్దలు కొడుతుంది రేవతి ముందు..

ఏంటి ముకుందా ఫస్ట్ నైట్ కి ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నావ్ అని అలేఖ్య అడుగుతుంది. నువ్వు ఊరుకో అలేఖ్య నన్ను నువ్వు మరీ ఊహల్లో తేలిపోయేలా చేస్తున్నావు అని అంటే ముందు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావో చెప్పు అని అలేఖ్య అడుగుతుంది ప్యారిస్ వెళ్లాలని అనుకుంటున్నాను అని అనగానే.. నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్లండి అని అలేఖ్య అంటుంది. నాకు మురారి ఉంటే చాలు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు తనే నా ప్రపంచం అని ముకుందా అంటుంది .అదిగో నీ ప్రపంచం ఏంటో దిగాలుగా ఇంటికి వస్తుంది చూడు అని అలేఖ్య అనడంతో ముకుందా మురారి వైపు చూస్తుంది. అంతలోకి మురారి ఇంటికి దిగాలుగా వస్తాడు.

ఏమైంది మురారి అలా ఉన్నావు అని వాళ్ళ పెద్దమ్మ అడుగుతుంది బయట వర్షం ట్రాఫిక్ జామ్ అయింది పెద్దమ్మ అని అంటాడు. కృష్ణ హాస్పిటల్ లోనే ఉంది లేటుగా వస్తానని చెప్పింది అని అంటాడు. వెంటనే మధు కృష్ణ ఇంట్లోనే ఉంది మురారి అదిగో వస్తుంది చూడు అని అంటాడు. ఇక మురారి బుక్ కాకుండా కృష్ణ ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. కానీ వీళ్ళిద్దరి మాటల్లో ఎవరి మాటలు నమ్మలో అర్థం కాక భవాని ఆలోచనలో పడుతుంది.

గదిలోకి వెళ్ళిన మురారి ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణ తన మాటలతో మురారి మనసులో ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవాలని అడుగుతుంది. మురారి కూడా కృష్ణకి నిజం చెప్పేయాలని అనుకుంటాడు. మీరు ఇప్పటివరకు మీ పెద్దమ్మ దగ్గర గాని మీ అమ్మ దగ్గర గాని ఏమైనా నిజాలు దాచారా అని కృష్ణ అడగగానే.. దాచాను అని మురారి సూటిగా చెబుతాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు కృష్ణ. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు సలహా ఇవ్వు అని మురారి అంటాడు. ఎలాగో చెప్పలేదు కాబట్టి ఆగి ఆలోచించి ఆ తప్పును సరిదిద్దుకుంటే మంచిది అని కృష్ణ సలహా ఇస్తుంది. ఇది మంచి సలహా కృష్ణ థాంక్యూ అని మురారి అంటాడు. పొద్దున తినలేదు అన్నారు కదా ముకుంద వంట చేసింది. కడుపునిండా తిందురు గాని పదండి అని కృష్ణ అంటుంది.

ఇంకా రేపటి ఎపిసోడ్ లో ముకుందా మురారి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కృష్ణ చాటు నుంచి చూస్తుంది నువ్వు ఏమన్నా మురారి నీ జీవితంలో నాకు తప్ప ఇంకెవరికీ స్థానం ఉండదు అని అన్నావు. నువ్వు ఈ జన్మలో మారవు. నిన్ను మార్చాలి అనుకోవడం కన్నా బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు అని మురారి అంటాడు. ప్లీజ్ ముకుంద నేను నిన్ను ఒకప్పుడు ప్రేమించిన మాట వాస్తవమే. కానీ నా ప్రాణ స్నేహితుడి భార్యను నేను ఎప్పటికీ అలా చూడలేను. నీకు రెండు చేతులు జోడించి దండం పెడుతున్నాను. చావనైనా చేస్తాను కానీ నేను నిన్ను ప్రేమించను. కృష్ణ ఎప్పటికీ నా మనసులో ఉంటుంది అని మురారి చెబుతాడు. ఆ మాటలు విన్న కృష్ణ సంతోషిస్తుంది.