NewsOrbit
జాతీయం న్యూస్

CBI: సీబీఐ నూతన బాస్ గా ప్రవీణ్ సూద్

Praveen Sood appointed as CBI new director

CBI: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ నియమితులైయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ప్రవీణ్ సూద్ ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా ఉన్నారు. ఆయన 2020 లో కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేసే హైపవర్ కమిటీ .. ప్రవీణ్ సూద్ నియామకానికి ఆదివారం తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ కమిటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవీ చంద్రచూడ్, లోక్ సభ లో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్నారు.

Praveen Sood appointed as CBI new director
Praveen Sood appointed as CBI new director

 

ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్ గా ఉన్న సుబోధ్ కుమార్ జైస్వాల్ ఈ నెల 25వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. జైస్వాల్ పదవీ కాలం ముగిసిన వెంటనే ప్రవీణ్ సూద్ బాధ్యతలు చేపడతారని కేంద్ర ప్రభుత్వం తన ఉత్తర్వులో వెల్లడించింది. గత మూడేళ్లుగా కర్ణాటక డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్ సూద్ ఢిల్లీ ఐఐటీ, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నారు. న్యూయర్క్ లోని సిరక్యూస్ విశ్వ విద్యాలయంలోనూ విద్యాభ్యాసం చేసారు. ప్రవీణ్ సూద్ కర్ణాటక లోని బళ్లారి, రాయచూర్ జిల్లాలకు ఎస్పీగా, బెంగళూరు నగర డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) గానూ సేవలు అందించారు. అదనపు పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్), మైసూర్ సిటీ పోలీస్ కమిషనర్ గానూ పని చేశారు. ఇక్కడ పాక్ సంతతి టెర్రరిస్టులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మారిషన్ ప్రభుత్వానికి పోలీసు సలహాదారుగాను పని చేశారు. సమర్దవంతమైన సేవలు అందించినందుకు గానూ ప్రవీణ్ సూక్ 2011 లో నేషనల్ ఈ గవర్నెన్స్ గోల్డ్ అవార్డు అందుకున్నారు. అంతకు ముందు 2006లో ప్రిన్స్ మైఖెల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు ను ఆయన తీసుకున్నారు.

అయితే ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారంటూ ప్రవీణ్ సూద్ పై కే పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా పని చేస్తున్నారంటూ బహిరంగంగానే ఆరోపించారు శివకుమార్. డీజీపీ పై చర్యలు తీసుకోవాలని ఈసీ కి లేఖ రాస్తారామని కూడా కొన్ని వారాల క్రితం పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మరుసటి రోజే సీబీఐ డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్ ఎంపిక కావడం విశేషం.

చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ .. చంద్రబాబు నివాసం అటాచ్  

Related posts

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?