ఆంధ్రా ఆక్టోపస్ అంచనాలు తారుమారు

Share

ఇప్పటి వరకూ ఎన్నికల సర్వేల విషయంలో లగడపాటి సర్వేలకు ఒక విశ్వసనీయత ఉండేది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో ఆయన సర్వే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పినట్లు చిలక జోస్యం స్థాయికి పడిపోయింది. వార్ వన్ సైడే పోలింగ్ శాతం పెరిగితే కూటమి వన్ సైడ్ గా విజయం సాధిస్తుందన్న ఆయన అంచనాలు పూర్తిగా తప్పయ్యాయి. ఫలితాల సరళిని బట్టి చూస్తే కారు ఆధిక్యత చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కనీసం రెండు పదుల స్థానాలను కూడా ప్రజాకూటమి చేరుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ దశలో లగడపాటి సర్వేల విశ్వసనీయత మసకబారిందనే చెప్పాలి.

ఎగ్జిట్ పోల్స్ వెలువరించే సంప్రదాయాన్ని కూడా ఉల్లంఘించి పోలింగ్ కు ముందే అంచనాలు అంటే లగడపాటి వెలువరించినప్పుడే ఎప్పుడూ లేని విధంగా ఇలా ఎందుకు చేశారన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అంచనాలు చెబుతున్నాననంటూ ఆయన కూటమికి అనుకూలంగా చేసిన ప్రకటన పోలింగ్ కు ముందు ఏదో మేరకు ఓటర్లను ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నంగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఆయన అంచనాలు, గతంలో ఆయన అంచనాలు నిజమైన పరిస్థితి నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ తీవ్రంగా పెరిగిన మాట వాస్తవం. అయితే ఫలితాల సరళిని బట్టి చూస్తే లగడపాటి ఏదో రాజకీయ ప్రయోజనం ఆశించే సర్వే అంచనాలను ప్రకటించారని భావించాల్సి ఉంటుంది. మొత్తంగా తెరాస ముందు నుంచీ చెబుతున్నట్లుగానే గతానికి మించి అద్భుత ఫలితాలను సాధించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనిస్తోంది. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 89 స్థానాలు, కాంగ్రెస్ 16, బీజేపీ4, ఎంఐఎం 5 ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 1 స్థానం, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. అటు నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 7 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్ 1, టీడీపీ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 2 స్థానాల్లోనూ ఇండిపెండెంట్ ఒకరు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ 9 స్థానాల్లోనూ కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యత కనబరుస్తుంది. ఇకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 1 స్థానంలోనే ఆధిక్యతలో ఉంది. ఇకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 8 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. అటు కాంగ్రెస్ 1 స్థానంలో బీజేపీ 1 స్థానంలో ఆధిక్యతలో ఉంది. ఇకపోతే హైదరాబాద్ లో టీఆర్ఎస్ 6, బీజేపీ 4, ఎంఐఎం 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.


Share

Related posts

17 నుంచి తెలంగాణ అసెంబ్లీ

somaraju sharma

‘చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

somaraju sharma

పెళ్లి సంబంధాలన్నీ చెడగొడుతున్నాడ‌ని.. షాపును జేసీబీతో కూల్చేశాడు.. చివరికి?

Teja

Leave a Comment