చిదంబరంకు కోర్టులో ఊరట

96 views

ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంలకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో వారిరువురినీ అరెస్టు చేయకుండా సీబీఐ ప్రత్యేక కోర్టు తాత్కాలికంగా గతంలో ఇచ్చిన ఉత్తర్వుల గడువును పొడిగించింది.

ఈ కేసుకు సబంధించి వారిరువురినీ అరెస్టు చేయవద్దంటూ వారికి సీబీఐ ప్రత్యేక కోర్టు గతంలో తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసందే. ఆ తాత్కాలిక ఉత్తర్వుల గడువు నేటితో ముగియనుండగా…ఇప్పుడా గడువును పొడిగించింది. ఈ కేసు విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. దీంతో వీరిరువురినీ సీబీఐ అప్పటి వరకూ అరెస్టు చేయదు.తనపై రాజకీక కక్షతోనే తప్పుడు కేసులతో వేధిస్తున్నారని చిదంబరం ఆరోపిస్తున్నారు.