NewsOrbit
న్యూస్ హెల్త్

వామ్మో.. 2020 ట్రైలర్ అంటా.. 2021 కరోనా సినిమా చూపించడం ఖాయం!

చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత యావ‌త్ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న వైర‌స్ ఏదైనా ఉందంటే అది కేవ‌లం క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) మాత్ర‌మే. ఎందుకుంటే ఈ వైర‌స్ ఇప్ప‌టికే సృష్టించిన సంక్షోభం అంతాఇంకా కాదు. మొద‌ట చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగుచూసిన ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. త‌న విశ్వ‌రూపాన్ని చూసిస్తూ.. అతి త‌క్కువ కాలంలోనే అన్నీ దేశాల‌కు విస్త‌రించి.. త‌న ప్ర‌భావాన్ని పెంచుకుంటూనే ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కూ దాదాపు 6 కోట్ల‌కు ద‌గ్గ‌ర‌గా ప్ర‌జ‌లు ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు.

అలాగే, దాదాపు 13 ల‌క్ష‌ల మంది ఈ క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌జ‌ల ప్రాణాలు తీయ‌డంతో పాటు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆర్థిక‌, సామాజిక‌, ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టింది ఈ కోవిడ్‌-19. చాలా దేశాలు క‌రోనా విజృంభ‌ణ‌కు అడ్డుక‌ట్ట వేయ‌డానికి లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించాయి. దీంతో ఆయా దేశాల్లో వాణిజ్య కార్య‌క‌లాపాలు క్షీణించ‌డంతో కోట్లాది మంది త‌మ ఉపాధిని కోల్పోయారు. తిన‌డానికి తిండిలేని ద‌రిద్రంలోకి జారుకున్న వారు కోట్ల‌ల్లో ఉన్నారు.

అయితే, ఇటీవ‌లే ప‌లు వ్యాక్సిన్లు ఆశాజ‌న‌కంగా ఫ‌లితాలు రాబ‌ట్ట‌డంతో వ‌చ్చే ఏడాది వ‌ర‌కూ ప‌రిస్థితులు కుదుట‌ప‌డుతాయ‌ని అనుకుంటున్న వేళ నోబెల్ విజేత అయిన‌ ప్రపంచ ఆహార కార్యక్రమం (వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్-డ‌బ్ల్యూఎఫ్‌పీ) చీఫ్ డేబిడ్ బేస్లీ సంచ‌ల‌న, ఆందోళ‌నక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 2020 ఏడాది కంటే రాబోయే ఏడాది (2021)లో ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా మారుతాయ‌నీ, 2021 సంవ‌త్స‌రం మ‌రింత ద‌రిద్రంగానూ, భ‌యాన‌కంగానూ ఉండ‌బోతుంద‌ని డేవిడ్ బేస్లీ అన్నారు. ఇప్ప‌టికే చాలా దేశాలు క‌రోనా కార‌ణంగా ద‌రిద్రంలోకి జారుకున్నాయ‌నీ, మ‌రికొన్ని దేశాలు సైతం అదే దిశ‌గా ప‌య‌నిస్తున్నాయ‌ని తెలిపారు. కరోనా వైర‌స్ సృష్టించిన ఆర్థిక సంక్షోభం కార‌ణంగా ఆకలి అనే మహమ్మారి సైతం పీక్స్ కు చేరబోతున్నద‌ని తెలిపారు.

ఇప్ప‌టికే చాలా దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు, పేదలకు ఆర్థిక సహాయం వంటి కార్యక్ర‌మాల ద్వారా ఉన్న నిధులతో 2020ను ఎలాగోలా మేనేజ్ చేశారు కానీ, వచ్చే ఏడాదిని ఎదుర్కొవ‌డం క్లిష్టంగా మారింద‌ని అన్నారు. ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని 50కి పైగా దేశాలు దివాళా తీశాయ‌ని తెలిపారు. ఒక్క‌చైనా మిన‌హా అన్ని దేశాల ఆర్థిక వృద్ధి మైన‌స్ లోకి జారుకున్న‌ద‌ని తెలిపారు. వ‌చ్చే ఏడాది ప్రారంభం నాటికి క‌రోనాను అడ్డుకునే వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చినా.. దాని ప్ర‌జ‌లంద‌రికీ పంపిణీ చేయ‌డానికి చాలా సంవ‌త్స‌రాలు ప‌డుతుంద‌ని అన్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ.. ఆశావాద దృక్ఫ‌ధంతో ముందుకు సాగ‌డం కీల‌క‌మ‌ని తెలిపారు.

Related posts

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju