బెంగాల్ః పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ నటి పట్ల పెట్రోల్ బంక్ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. జుహిసేన్ గుప్త అనే బెంగాలీ టీవీ సీరియల్ నటి..తన తల్లిదండ్రులతో కలిసి ఆదివారం బయటకు వెళ్లింది. ఈ క్రమంలో ఓ పెట్రోల్ బంక్‌కు వెళ్లి..కారులో రూ.1500 పెట్రోల్ పోయాలని కోరగా.. బంక్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి రూ.3 వేలకు పోశారు. దీనిపై నటి తండ్రి.. సిబ్బందిని ప్రశ్నించగా అమర్యాదగా ప్రవర్తించారు. నటితో వాగ్వాదానికి దిగారు. వృద్ధుడు అని కూడా చూడకుండా తన తండ్రిని పక్కకు నెట్టేశారని నటి తెలిపింది. బంక్ సిబ్బంది తీరుపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బంక్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాను పరిశీలించారు. అయితే నటితో బంక్ సిబ్బంది రాజీ చేసుకోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం నగరం ఎవరికీ సురక్షితం కాదంటూ నటి గుప్త సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
previous post
next post