NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఎయిర్టెల్ × టాటా స్కై × డిష్ × డీ2హెచ్..! ఏది మంచిదో తెలుసుకోండి..!!

 

వినోద అవసరాలన్నింటికీ అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించినదే డిటిహెచ్.. ఇటీవల కాలంలో డిటిహెచ్ కనెక్షన్ల సంఖ్య బాగా పెరిగింది.. మామూలు కేబుల్ కనెక్షన్లు క్రమేపీ తగ్గిపోతున్నాయి.. డిటిహెచ్ కనెక్షన్ గురించి మరో ముఖ్యమైన ప్రయోజనం విషయానికొస్తే.. ఒక ఇంట్లో రెండు డిటిహెచ్ కనెక్షన్లు తీసుకోవాలనుకునే వారు ఇక మీదట కేవలం 40% NCF ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు కావాలనుకునే వారికి కచ్చితంగా ఈ కొత్త నియమం ప్రయోజనకరంగా ఉంటుంది.. డిటిహెచ్ రంగంలో చాలా మంది ఆపరేటర్లు ఉన్నారు. ప్రతి ఆపరేటర్ తన వినియోగదారులకు వారి బడ్జెట్ ధరలోను మరియు అధిక ధర వద్ద కూడా సెట్-టాప్ బాక్స్‌లను (STB) విక్రయిస్తున్నారు. డిటిహెచ్ విభాగంలో టాటా స్కై, డిష్ టివి, D2h, మరియు ఎయిర్టెల్ డిజిటల్ టివి వంటి కంపెనీలు తన వినియోగదారులకు స్టాండర్డ్ డెఫినిషన్(SD), సెట్-టాప్ బాక్స్ 4K, Android STB ల వరకు ఎంచుకునే ఎంపికలు ఇలా ఉన్నాయి..

SD, HD సెట్-టాప్ బాక్స్ పూర్తి వివరాలు :
ఎయిర్టెల్ :
డిటిహెచ్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఎయిర్‌టెల్ డిజిటల్ టివి యొక్క SD సెట్-టాప్ బాక్స్‌ను ఇప్పుడు కేవలం రూ.1,100 వద్ద కొనుగోలు చేయవచ్చు. డిటిహెచ్ మొత్తం మార్కెట్లోని చౌకైన ధరలో లభించే STB లలో ఇది ఒకటి. ఇది USB ద్వారా రికార్డింగ్ చేయవచ్చు. SD సెట్-టాప్ బాక్స్ లో నాణ్యతను కలిగి ఉండదు. ఎక్కువ నాణ్యత గల కంటెంట్‌ కోసం HD సెట్-టాప్ బాక్స్ ను కొనుగోలు చేసుకోవచ్చు. దీని ధర SD STB కంటే కేవలం రూ.200 మాత్రమే ఎక్కువ.
టాటా స్కై :
డిటిహెచ్ రంగంలో రెండోవ స్థానంలో నిలిచిన టాటా స్కై తన వినియోగదారులకు అందించే సమర్పణలలో STB చాలా చౌకైనది. అయితే టాటా స్కైకి చెందిన SD, HD STBల ధరలు 1,499 రూపాయలు. కాకపోతే టాటా స్కై యొక్క SD, HD ప్లాన్ లు ఖరీదైనవి. ఈ రెండు ఎస్‌టిబిల మధ్య కంటెంట్‌, సౌండ్ నాణ్యత మాత్రమే తేడా ఉంటాయి.
డిష్ :
తక్కువ ధరలో లభించే సెట్-టాప్ బాక్స్ లలో డిష్ఎన్ఎక్స్ టి STB ఒకటి. దీని ధర రూ.1,490. ఈ కనెక్షన్ తో పాటు ఒక నెల చందా, జీవితకాల వారంటీని ఉచితంగా అందిస్తుంది. అంతేకాకుండా దునియా కూపన్ నుండి రూ.2,000 విలువైన ఉచిత కూపన్లను పొందవచ్చు.
D2h :
డి 2 హెచ్ తన సెట్-టాప్ బాక్స్ ను రూ.1,499 లకే అందిస్తుంది. క్రొత్త కొనుగోలు చేసిన వినియోగదారులకు 60 SD ఛానెళ్ళు గల గోల్డ్ కాంబోతో ఒక నెల సభ్యత్వంను ఉచితంగా అందిస్తుంది. అలాగే HD సెట్-టాప్ బాక్స్ కూడా ఖరీదైనది కాదు. దీని SD సెట్-టాప్ బాక్స్ కంటే కేవలం రూ.100 ఎక్కువ.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju