NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

Allu Arjun-Vishal: ప్రముఖ హీరో విశాల్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న విశాల్‌.. ప్రస్తుతం రత్నం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. సింగం సిరీస్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న హరి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రియా భవాని శంకర హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 26న తెలుగు, తమిళ భాషల్లో రత్నం మూవీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ విశాల్ రత్నం మూవీని గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు.

ఇందులో భాగంగానే తాజాగా తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు. గతంలో తాను తెలుగులో కొన్ని చిత్రాలను వదులుకున్నారని.. అందులో అల్లు అర్జున్ మూవీ కూడా ఉందని విశాల్ వెల్ల‌డించాడు. ఇంతకీ అల్లు అర్జున్, విశాల్ కాంబినేషన్‌లో మిస్ అయిన సినిమా మరేదో కాదు వరుడు. గుణశేఖర్ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, భాను శ్రీ మెహ్రా జంటగా నటించారు. తమిళం నటుడు ఆర్య విలన్ గా చేయ‌గా.. సుహాసిని, ఆశిష్ విద్యార్థి, నరేష్, కిషోరి బల్లాల్, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు.

డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీకి మణి శర్మ స్వ‌రాలు అందించాడు. రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామాగా రూపుదిద్దుకున్న వ‌రుడు భారీ అంచ‌నాల న‌డుమ 2010 మార్చి 31న విడుద‌లైంది. అయితే తొలి ఆట నుంచే ఈ చిత్రం నెగ‌టివ్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది. క‌నీసం అల్లు అర్జున్ అభిమానుల‌ను కూడా వ‌రుడు మెప్పించలేక‌పోయింది. డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ కంటెంట్‌పై కంటే విజువ‌ల్స్‌ మరియు గ్రాఫిక్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. తెర మొత్తం న‌టులు ఉన్నా.. గుణ‌శేఖ‌ర్ ఎవ్వ‌రినీ స‌రిగ్గా వాడుకోలేక‌పోయాడు. దాంతో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌రుడు మూవీ డిజాస్ట‌ర్ అయింది. క‌నీస వ‌సూళ్లు కూడా అప్ప‌ట్లో ఈ చిత్రం రాబ‌ట్ట‌లేక‌పోయింది.

ఇక‌పోతే ఈ సినిమాల్లో అల్లు అర్జున్ ఢీ కొట్టే విల‌న్ గా దివాకర్ పాత్ర‌లో ఆర్య న‌టించాడు. నెగ‌టివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ కు అత‌ను పూర్తి న్యాయం చేశాడు. అయితే నిజానికి వ‌రుడు మూవీలో విల‌న్ గా మొద‌ట విశాల్ ను తీసుకోవాల‌ని డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ భావించాడట‌. విశాల్ ను క‌లిసి క‌థ కూడా చెప్పాడ‌ట‌. కానీ విశాల్ మాత్రం ఒప్పుకోలేదు. హీరోగా దూసుకుపోతున్న త‌రుణంలో విల‌న్ గా న‌టించేందుకు విశాల్ ఇండ్రెస్ట్ చూపించ‌లేదు. ఈ కార‌ణంగా ఆయ‌న వ‌రుడు మూవీని సున్నితంగా తిర‌స్క‌రించాడు. దాంతో విశాల్ కు బ‌దులుగా గుణ‌శేఖ‌ర్ ఆర్య‌ను తీసుకున్నారు. తాజా ఇంట‌ర్వ్యూలో విశాల్ ఈ విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు. వ‌రుడు సినిమాలో త‌న‌కు అవ‌కాశం వ‌చ్చింద‌ని.. కానీ మ‌న‌సు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపాడు. అలాగే ఇటీవ‌ల విడుద‌లైన లియో మూవీలో అర్జున్ పాత్ర కూడా మొద‌ట విశాల్ వ‌ద్ద‌కే వెళ్లింది. డేట్స్ స‌ద్దుబాటు కాక‌పోవ‌డంతో విశాల్ లియోను కూడా రిజెక్ట్ చేశాడు.

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu