NewsOrbit
న్యూస్

ట్రంప్ కోటను కూల్చినట్టేనా..!? అమెరికా ఎన్నికలు ఎటువైపు..!?

అమెరికా ఎన్నికలంటే ప్రపంచమంతటా ఆసక్తి..! ఆర్ధిక కేంద్రం అమెరికా.., సాఫ్ట్ వెర్ కేంద్రం అమెరికా.., ఐటీ ఉపాధి కేంద్రం అమెరికా.. ఫార్మసీ కేంద్రం అమెరికా..! ఇలా అనేక రంగాల్లో ప్రపంచ దేశాలకు అమెరికా ఆదర్శం, ఆసక్తి, అభిమానం, అసూయ కూడా..! అటువంటి అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నిక అంటే అన్ని దేశాలు తల దూర్చి చూస్తుంటాయి. హోరాహోరీగా, అత్యంత ఉత్కంఠగా జరుగుతున్నాయి..! ఆ పరిణామాలు, పర్యవసానాలు చూద్దాం..!

ఎక్కువ ఓట్లు వచ్చినంత మాత్రాన కాదు..!!

మనలాగా అమెరికాలో ఎక్కువ ఓట్లు వచ్చినంత మాత్రానా గెలిచినట్టు కాదు. 2016 ఎన్నికల్లో చూసుకుంటే ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ) కంటే హిల్లరీ క్లింటన్ (డొమెక్రాటిక్) అభ్యర్ధికి 30 లక్షల ఓట్లు వచ్చాయి. కానీ అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచారు కారణం ఏమిటంటే..? అక్కడ రాష్ట్రాల్లో ఎలక్ట్రోరల్ కాలేజ్ ఓట్లు కీలకం. దేశం మొత్తం మీద 530 ఉండగా.., 270 గెలిచిన వారికి అధ్యక్ష పీఠం దక్కుతుంది. అలా 2016 లో ట్రంప్ 306 స్థానాలు గెలుచుకుని అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే ప్రజలు ఎక్కువగా హిల్లరీకి ఓట్లు వేసినందుకు.. నైతికంగా ఆమెనే గెలిచినట్టు భావించారు. అలా ట్రంప్ తొలిసారిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. నాలుగేళ్లు తర్వాత ఇప్పుడు మళ్ళీ అమెరికా ఎన్నికలు అత్యంత ఉత్కంఠగా జరుగుతున్నాయి. ఈసారి కూడా డొమెక్రాటిక్ అధ్యక్షా అభ్యర్థి బైడెన్ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కి పోటీగా ఉన్నారు. గతం కంటే ఈరోజు జరిగిన పోలింగ్ లో ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.

ట్రంప్ కి వ్యతిరేక పవనాలు..!?

ఈ ఎన్నికల్లో ట్రంప్ కి ఎదురుగాలి తగులుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కరోనాని ఎదుర్కోవడం.., ఐటీ ఉద్యోగులను డీల్ చేయడం.. ఇతర కీలక విషయాల్లో ట్రంప్ తప్పటడుగులు వేశారని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. ఒక రకంగా ట్రంప్ కూడా కరోనా విషయంలో సిల్లీగా ప్రవర్తించారని అంతర్జాతీయ మీడియా కూడా పేర్కొంది. అతని ప్రవర్తన, మాటలు, చేష్టలు.. అన్ని అమెరికన్లకు చికాకు పుట్టించాయని.. ఈసారి తమదే గెలుపు అంటూ డెమొక్రాట్లు లెక్కలు వేస్తుండగా.., ట్రంప్ క్యాంపు కూడా కీలకంగా లెక్కలు వేసుకుంటుంది. అక్కడ కూడా ఇక్కడ లాగానే ఓటుకి నోటు (పరోక్షంగా పథకాల రూపంలో) పని చేసిందని అనుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే కరోనా సాయాన్ని కూడా ట్రంప్ ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు. సో.. ట్రూప్ పోల్ మేనేజ్మెంట్, అతని తెలివి, అమెరికన్లకు ఇచ్చిన ఉద్యోగ, ఆరోగ్య హామీలు బాగా కలిసొస్తాయని భావిస్తున్నారు.

జాతీయ మీడియా ఏమంటుంది..!?

అమెరికాలో ఎగ్జిట్ పోల్స్ కీలకంగా ఉంటాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు అమెరికా ఎన్నికలపై దృష్టి పెట్టి కీలక సర్వేలు బయటపెట్టాయి. వీటిని పరిశీలిస్తే అన్నిట్లోనూ బైడెన్ కె మొగ్గు కనిపిస్తుంది. ట్రంప్ కి అనుకూలంగా ఉండే ఫాక్స్ అనే సంస్థ కూడా ట్రంప్ కి 44 శాతం, బైడెన్ కి 52 శాతం ఓట్లు అంటూ తేల్చింది. ట్రంప్ కి వ్యతిరేకంగా ఉండే CNN సంస్థ బైడెన్ కి 54 శాతం, ట్రంప్ కి 44 శాతం ఓట్లు అంటూ తేల్చింది. ప్రఖ్యాత రౌటర్స్ సంస్థ కూడా ట్రంప్ కి 42 , బైడెన్ కి 54 శాతం అంటూ వివరాలు బయట పెట్టింది. అంటే… ఏ సంస్థ లెక్కలు చూస్తున్నా ట్రంప్ ఓటమి తప్పడం లేదు అనిపిస్తుంది. మరోవైపు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అక్కడి సుప్రీం కోర్టు తీర్పులు కూడా ట్రంప్ కి వ్యతిరేకంగా వస్తుండడంతో ఆయనలో అసహనం కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా నేరుగా కోర్టులను విమర్శిస్తున్నారు..!

 

author avatar
Srinivas Manem

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju