ఓహో.. వీళ్లంతా ఒకటే బ్యాచ్ అన్నమాట? యాంకర్ రవి, సోహెల్ రచ్చ రచ్చ చేశారు?

యాంకర్ రవి.. పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ రవి ఎక్కడుంటే అక్కడ రచ్చ రంబోలానే. రవి మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా అప్పుడప్పుడు ఎటకారం ఉంటుంది. మొత్తానికి బుల్లితెరను యాంకర్ రవి ఏలేస్తున్నాడు అనడంలో ఆశ్చర్యం లేదు.

anchor ravi sankranti celebrations with bigg boss 4 sohel
anchor ravi sankranti celebrations with bigg boss 4 sohel

అసలు విషయం ఏంటంటే.. యాంకర్ రవి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాడు? ఎవరితో చేసుకున్నాడు? అనే దానికి సంబంధించిన వీడియోను తాజాగా తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశాడు యాంకర్ రవి. అది పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

మనోడి సంక్రాంతి సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. ముందు ఇంట్లో కాసేపు పూజలు అవీ ఇవీ చేసి.. తిన్నగా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లాడు రవి. తన ఫ్రెండ్స్ అంటే ఎవరనుకుంటున్నారు. ఇంకెవరు బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అలీ. అవును.. అలీ ఇంటికి వెళ్లగానే అక్కడ బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సోహెల్, బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారట. ఇక చూసుకోండి.. వీళ్లంతా కలిసి చేసిన రచ్చ మామూలుగా లేదు. డ్యాన్సులు చేసుకుంటూ… పతంగులను ఎగరేస్తూ మామూలు రచ్చ చేయలేదు.

దీని గురించి చెప్పడం కన్నా.. మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. లెట్స్ వాచ్ ది వీడియో.