Anchor Syamala : యాంకర్ శ్యామల తెలుసు కదా. తను తెలుగులోనే ఒకప్పుడు టాప్ యాంకర్. చాలా ఏళ్ల పాటు తెలుగులో యాంకర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగించింది శ్యామల. తను సినిమాల్లోనూ నటించింది. యాంకర్ శ్యామల బుల్లితెర మీద తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. యాంకర్ శ్యామలకు ఒకప్పుడు చాలా అవకాశాలు వచ్చేవి. యాంకర్ సుమతో పాటు మిగితా యాంకర్లతో కూడా యాంకర్ శ్యామల కో యాంకరింగ్ చేసింది.

కొన్నేళ్ల తన యాంకరింగ్ కెరీర్ తర్వాత తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుంది శ్యామల. ప్రస్తుతం బుల్లితెర మీద పెద్దగా తనకు అవకాశాలు లేకున్నా… తను సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టి తన అభిమానులతో టచ్ లో ఉంటోంది శ్యామల.
Anchor Syamala : చీరాల బీచ్ లో శ్యామల ఎంజాయ్
ఉగాదికి తన ఫ్యామిలీతో కలిసి తన సొంతూరు చీరాలకు వెళ్లిన యాంకర్ శ్యామల…. అక్కడ చీరాలలో ఉన్న బీచ్ కు ఫ్యామిలీతో వెళ్లి తెగ ఎంజాయ్ చేసింది. సముద్రంలో ఫుల్ ఎంజాయ్ చేసింది. తన పిల్లలతో కలిసి బీచ్ లో శ్యామల చేసిన రచ్చ మామూలుగా లేదు. మొత్తం మీద ఉగాది ట్రిప్ లో శ్యామల ఫుల్ టు ఎంజాయ్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా యాంకర్ శ్యామల బీచ్ వీడియోను చూసేయండి.