NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana: తెలంగాణలో మరో సంచలనం!టీఆర్ఎస్ ఎమ్మెల్యే తోపాటు ఎమ్మార్వోపై కేసు నమోదు!!

Telangana: భూ వివాదంలో ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే తో పాటు కాప్రా ఎమ్మార్వో మీద కేసు నమోదైంది.హైదరాబాద్ సిటీలోని ఉప్పల్ అధికార పార్టీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ,ఎమ్మార్వో గౌతమ్ కుమార్ ల మీద జవహర్ నగర్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా లోని  సర్వే నంబర్ 152 లో 90 ఎకరాల భూమి విషయం వివాదంలో ఉంది.

Another sensation in Telangana! Case registered against TRS MLA and MRO !!
Another sensation in Telangana Case registered against TRS MLA and MRO

ఈ వివాదంలో తల దూర్చిన ఎమ్మెల్యే ఎమ్మార్వోలు సమస్య పరిష్కారానికి తమను డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అంతేగాక తాము చెప్పినట్లు వినకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆ స్థలం యజమాని మేకల శ్రీనివాస్ యాదవ్ న్యాయస్థానం లో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు.దీనిని విచారించిన న్యాయస్థానం ఎమ్మెల్యే ,ఎమ్మార్వోలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.దీంతో జవహర్ నగర్ పోలీసులు వారిపై ఐపీసీ 120,166a,167, 168, 170, 171, 447, 468, 471, 307, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.టీఆర్ఎస్ వర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది.ఇంతకుముందు ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేసేంత వరకూ వెళ్లిన సిఎం కెసిఆర్ ఇప్పుడేం చేస్తాడు అన్నది ప్రశ్నగా మారింది.అలాగే కెసిఆర్ మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్ మల్లారెడ్డి కూడా ఈ తరహా బెదిరింపులకు ఫోన్లో ఆడియో టేప్ బయటకు వచ్చినా కెసిఆర్ ఏ చర్యలూ తీసుకోకపోవటం ఇక్కడ గమనార్హం.మరి ఉప్పల్ ఎమ్మెల్యేను కెసిఆర్ ఏం చేస్తారన్నది చూడాలి!

Telangana: ఎమ్మెల్యే సోదరుడి హల్చల్ !

లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేశాడ‌ని పోలీసులు అడ్డుకున్నందుకు పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తమ్ముడునని చెప్పుకున్న దాసరి అంజిరెడ్డి నడిరోడ్డుపై హల్చల్ చేశారు.సుల్తానాబాద్ మండలం, దుబ్బపల్లి ద‌గ్గ‌ర‌ పోలీసులు కరోనా లాక్ డౌన్లో భాగంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.ఆ సమయంలో ఆ మార్గంలో వస్తున్న కారును పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా ఆపారు.వెంటనే అందులో ఉన్న అంజిరెడ్డి కారు దిగి వీరంగమాడారు.నేనెవరిననుకుంటున్నారు? ఎమ్మెల్యే తమ్ముణ్ణి !నా కారునే ఆపుతారా అంటూ చెలరేగిపోయాడు.ఎవరైనా ఒక్కటే కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని పోలీసులు నచ్చజెపుతున్నా అతను ఏమాత్రం పోలీసులు లెక్కచేయలేదు. అంజిరెడ్డి వ్యవహారం మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదిప్పుడు వైరల్ అయింది.దీంతో పోలీసులు స్పందించి అంజిరెడ్డి పై కేసు నమోదు చేశారు.టీఆర్ఎస్ కు ఇదో మరో తలనొప్పి వ్యవహారంగా తయారైంది.

 

author avatar
Yandamuri

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju