NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP BJP: 2024 ఎన్నికలకు రాముడికి, క్రీస్తు మధ్యనే నంట..! ఇదెక్కడి చోద్యం..!!

AP BJP: సోషల్ మీడియాలో ఏవరో ఏదో సందేశం ఇస్తే దానికి బీజేపీ రియాక్ట్ కావడం, సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇవ్వడం ఆశ్చర్యకరంగా, చర్చనీయాంశంగా మారుతోంది. లౌకిక రాజ్యమైన భారతదేశంలో కులాలు, మతాలకు అతీతంగా ప్రజలు స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్నాయి. కానీ పలు రాజకీయ పార్టీలు మాత్రం మతాల పరంగా వైరుధ్యాలను సృష్టించి రాజకీయ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నాయి. వీరికి తగ్గట్టుగానే ప్రత్యర్థుల సందేశాలు, ప్రసంగాలు ఉంటున్నాయి. ఏపి బీజేపీ శాఖ తాజాగా తన అఫిషియల్ ట్విట్టర్ ఖాతాలో ఓ వివాదాస్పదమైన వీడియోను షేర్ చేస్తూ ఆ సందేశానికి కౌంటర్ ఇచ్చింది. ఇది ఇప్పుడు ఏపి రాజకీయ వ్యవహారాల్లో మరో హాట్ టాపిక్ గా మారుతోంది.

AP BJP Reacts on appsc member video speech
AP BJP Reacts on appsc member video speech

ఏపి పబ్లిక్ సర్వీస్ కమిషనర్ సభ్యుడుగా నూతలపాటి సోనీ వుడ్ ను ఇటీవల జగన్మోహనరెడ్డి సర్కార్ నియమించింది. ఆయన తన ప్రసంగంలో రాబోయే ఎన్నికల్లో క్రీస్తు, యెహోవా నిస్సీ జెండాలు పట్టుకుని పోరాడబోతున్నామంటూ వ్యాఖ్యానించిన వీడియోను ఏపి బీజేపీ షేర్ చేసింది. యుద్ధం పట్ల ఉత్సాహం చూపే గుర్రం ఆత్మను దేవుడు తనకు ఇచ్చాడనీ, అలాంటి ఆత్మ కలిగి ఉన్న వాళ్లు తనతో కలిసి నడవాలని సోనీ వుడ్ పిలుపు నిచ్చారు. దీనికి ఏపీ బీజేపీ బదులు ఇస్తూ “ మీరు చెప్పినట్లుగానే 2024 ఎన్నికలు రాముడికి, క్రీస్తుకు మధ్యనే జరగనివ్వండి.. ఫలితాన్ని ఏపి ప్రజలే నిర్ణయిస్తారు” అని పేర్కొంది.

రాజకీయ పార్టీ నేతలైనా, ప్రభుత్వాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న వారైనా కుల, మత, ప్రాంత విభేదాలు, వైరుధ్యాలకు తావు లేకుండా నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ మన దౌర్భాగ్యం బ్రిటీష్ వాడు అమలు చేసి వెళ్లిన డివైడ్ అండ్ రూల్ పాలసీని మన వాళ్లు వంట బట్టుకున్నారు.

కొసమెరుపు ఏమిటంటే ఏపి బీజేపీ నిన్న షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటిది కాదు. 2018 అక్టోబర్ నెలలో సోనీ వుడ్ ఫేస్ బుక్ పేజీలోనిది. ఏపి బీజేపీ పాత వీడియోను షేర్ చేస్తూ కామెంట్స్ చేయడం విమర్శలకు దారి తీస్తుంది.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N