NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Viveka Case: ఇక అరెస్టులకు సిద్ధం..! హత్య కేసులో సీబీఐ దారిలోకి వచ్చినట్టే..!!

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నాలుగో దఫా విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ కేంద్రంగా సీబీఐ బృందం గత 12 రోజులుగా పలువురు అనుమానితులను విచారిస్తున్నారు. అయితే ఈ విచారణ సందర్భంలో డ్రైవర్ దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, వివేకా పిఏగా పని చేసిన జగదీశ్వరరెడ్డి, వైసీపీ కార్యకర్తలు రమణ, కరుణాకర్, కిరణ్ కుమార్ యాదవ్ అతని సోదరుడు సునీల్ కుమార్ యాదవ్ తదితరులతో పాటు ఘటన జరిగిన రోజు అనుమానాస్పదంగా ఇన్నోవా వాహనంలో పులివెందులలో సంచరించిన ఇరికటవేముల రవి అలియాస్ మట్కా రవి, అతని డ్రైవర్ గోవర్థన్ తదితరులను విచారించారు. ఈ విచారణలో సీబీఐ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది.

ap ex minister YS viveka case cbi investigation update
ap ex minister YS viveka case cbi investigation update

Read More: TDP MP Kanakamedala Ravindra Kumar: కేంద్రానికి టీడీపీ ఎంపి కనకమేడల కీలక లేఖ..! అది ఏమిటంటే..!!

వివేకా కుమార్తె ఇచ్చిన అనుమానితుల జాబితాలో పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఆమె ఇచ్చిన పేర్లలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, సీఐ గంగిరెడ్డి, ఘటన జరిగిన రోజు కట్టుకట్టిన వైద్యుడు శంకర్ రెడ్డి తదితర 14 మంది పేర్లు ఉన్నాయి. సీబీఐ అధికారుల మొదటి రెండు మూడు దశల్లో పెద్ద పెద్ద వ్యక్తులను విచారించారు. సిట్ అధికారులు కూడా వారిని విచారించారు. అయితే నాల్గవ దశ విచారణలో  సీబీఐ అధికారులు పెద్ద పెద్ద వ్యక్తులను వదిలివేసి  చిన్న చిన్న వ్యక్తులను పిలిపించి విచారణ జరుగుతుండటంతో కేసు పక్కదారి పడుతుందా అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే వివేకా హత్య కేసులో పాత్రదారులప ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన సీబీఐ.. సాక్షాలు, అధారాల సేకరణలో పూర్తిగా నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పూర్తి అధారాలను సేకరించిన తరువాత అసలైన హంతకులను అరెస్టే చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.  విచారణలో భాగంగా 12వ రోజు వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని, కడపకు చెందిన చిన్నపరెడ్డి, లక్ష్మీరెడ్డి అనే వ్యక్తులను విచారించారు.

ap ex minister YS viveka case cbi investigation update
ap ex minister YS viveka case cbi investigation update

డీఐజీ క్యాడర్ కల్గిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి సుధాసింగ్ నేతృత్వంలో 8 మంది సిబీఐ డీఎస్పీల బృందం వివేకా హత్య కేసు దర్యాప్తును జరుగుతోంది. ఆమెకు క్రిమినల్ కేసుల పరిష్కారంలో మంచి పట్టు ఉందని సమాచారం. సుధాసింగ్ తన బృందంతో కడప, పులివెందులలో తిరుగుతూ విచారణను వేగవంతం చేశారు. వివేకా హత్య కేసును ఛేదించేందుకు మరింత లోతుగా దర్యాప్తును కొనసాగిస్తున్నారనీ, అ క్రమంలోనే ప్రతి ఒక్క అంశంపైనా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారని అంటున్నారు. చిన్న చేపను ఎర వేసి పెద్ద చేప పట్టే విధంగా దర్యాప్తు సాగుతొందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సారి దర్యాప్తులో మాత్రం హత్యకేసుకు సంబంధించి కొంత మంది వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు చార్జి షీటు ధాఖలు చేయడం ఖాయమన్న మాట వినబడుతోంది. సీబీఐ కేసు టేకప్ చేసిన తరువాత కూడా ఏడాదిన్నరగా ఒక్క అరెస్టు జరగగపోవడంపై పలు ఆనుమానాలు ప్రజల నుండి వినబడుతున్నాయి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N