NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఎప్పుడూ లేనంతగా బాబు మాటకి ఎదురు చెబుతున్న అచ్చెన్న?

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు…. ఆ తర్వాత లోకేష్..! తర్వాతే ఎవరైనా. గత దశాబ్దకాలంగా ఏపీ రాజకీయంలో జరుగుతున్నది ఇదే. ఇక టిడిపిలో సీనియర్ నేతలు ఉన్నారు కానీ వారంతా కేవలం నామమాత్రపు పదవులకు పరిమితం అవుతారే తప్పించి దాదాపు హవా అంతా వీరిద్దరిదే. మహా అంటే ఏదైనా క్లిష్ట సమయాల్లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు ఒక ముగ్గురు నలుగురు ఉంటారు.

 

What Will Chandrababu Do To Save Atchannaidu - ApHerald | DailyHunt

ఇక అలాంటి ముఖ్యమైన నేతల్లో ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడు అత్యంత కీలకం. అతను తెలుగుదేశం పార్టీకి అత్యంత సీనియర్ నేత, అనుభవజ్ఞుడు అలాగే మంచి ప్రతిభావంతుడు కూడా. అందుకే ఇప్పుడు అచ్చెన్నాయుడుకి ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ రాష్ట్ర ప్రెసిడెంట్ పోస్ట్ ను కట్టబెట్టాలని తెలుగుదేశం చూస్తోంది. అయితే అచ్చెన్న సన్నిహితుల దగ్గర నుండి సమాచారం ఏమిటంటే…. అచ్చెన్న ఆ పోస్టుకి ఆసక్తి చూపించడం లేదని. 

ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ అచ్చెన్నాయుడు ఒక్కసారిగా ఇలా ఎందుకు ప్లేట్ మారుస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇన్ని రోజులు గత ఐదేళ్లుగా ఈ పోస్ట్ లో ఉన్న కళా వెంకటరావు పరిస్థితుని తెలుసుకుని అచ్చెన్న ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఐదేళ్ళాలో కళావెంకట్రావును పక్కనెట్టి ఆయన సొంత నేతలు కూడా ఏదైనా విషయంలో నేరుగా చంద్రబాబు ని కలుస్తారే తప్ప కనీసం కళావెంకట్రావు ను కనీసం మధ్యవర్తిత్వానికి కూడా పరిగణించు అన్నది ఎప్పటినుంచో ఉన్న వాదన. ఇక బాబు కూడా వారితో నేరుగా మాట్లాడి అదే అలవాటు చేసేసారు అని అంటుంటారు. 

ఇదే సమయంలో అచ్చెన్నాయుడు పార్టీ ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టేందుకు ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితి కూడా అంత బాగోలేదు. ఇక మళ్ళీ రబ్బర్ స్టాంప్ పొజిషన్ కి పరిమితం కావడం ఇష్టం లేకుండా అతను ఖచ్చితంగా ఈ పోస్ట్ ను తిరస్కరిస్తారు అని అంటున్నారు. అయితే ఉత్తరాంధ్రలో కొంతమంది నేతలు మాత్రం అచ్చెన్నాయుడు చంద్రబాబు ఏది చెప్తే అది వింటారని…. నడుచుకుంటారని…. అటువంటివి ఏమీ లేవని నొక్కి వక్కాణిస్తున్నారు. ఇక చివరికి అచ్చెన్నాయుడు ఎటు వైపు మొగ్గు చూపుతారో చూడాలి.

author avatar
arun kanna

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!