NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబు మాటలు పెడచెవిన పెట్టిన తెలుగు తమ్ముళ్ళు ! ఏ విషయంలో??

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపును తెలుగు తమ్ముళ్లు లైట్ తీసుకున్నారు. ఆయన చెప్పింది ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశారు.దీంతో చంద్రబాబు మహా ఫీలై పోతున్నారని సమాచారం.

Babu's words were uttered by the Telugu brothers In any case
Babu’s words were uttered by the Telugu brothers In any case

అమరావతి ఉద్యమం ప్రారంభమై మూడొందల రోజులైన సందర్భంగా మూడు రోజుల సంఘీభావ కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు షెడ్యూల్ జారీ చేయడం తెలిసిందే. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలందరినీ అమరావతి మద్దతుగా ప్రెస్మీట్లు పెట్టమన్నారు. ఆదివారం నాడు స్కై క్యాండిల్ ప్రదర్శనలు చేయమన్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.ఇటీవలే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను నియమించినందున వల్ల మహిళా నేతలకు కొందరికి పదవులిచ్చిన కారణంతో ఈ కార్యక్రమాలు సూపర్ సక్సెస్ కాగలవని చంద్రబాబు ఆశించారు.కానీ వాస్తవంలో జరిగింది వేరుగా ఉంది.ఒక్క గుంటూరు కృష్ణా జిల్లాల్లో మినహాయిస్తే చంద్రబాబు పిలుపునకు తెలుగు తమ్ముళ్లు స్పందించలేదు.

శనివారం కొన్నిచోట్ల ప్రెస్మీట్ లయితే పెట్టారు గాని ఆదివారం స్కై క్యాండిల్ ప్రదర్శనలు జరపలేదు. సోమవారం రోడ్ల మీదికి రాలేదు. అమరావతికి పొరుగున ఉండటమే కాకుండా తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న ప్రకాశం జిల్లాలో పరిస్థితి మరీ దారుణం. రెండు లోక్సభ నియోజకవర్గాల టిడిపి సమన్వయకర్తగా ఉన్న ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాత్రం కనిగిరిలో కాస్త హడావిడి చేశారు. ఏది ఏమైనా ఇస్తే జిల్లాలో ఎక్కడా ఏ విధమైన సందడి లేదు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెలకొందంటున్నారు. సాధారణంగా చంద్రబాబు కార్యక్రమాల రూపకల్పన పక్కాగా ఉంటుంది..అవి సక్సెస్ కూడా అవుతుంటాయి. కానీ అమరావతి సంఘీభావ కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ కావటానికి రకరకాల కారణాలు ఉన్నాయంటున్నారు.ముఖ్యంగా మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత కానరావడం లేదు.అమరావతి అంటే చంద్రబాబు ఆస్థానంగా అందరికీ కనిపిస్తోంది.

కేవలం చంద్రబాబు కోసం ఈ తరహా నిరసన ప్రదర్శనలు చేసి తామెందుకు అందరికీ వ్యతిరేకం కావాలి అన్నది టిడిపి నేతల ఆలోచనగా గోచరిస్తోంది.అమరావతి రాజధానిగా ఉండాలంటూ కార్యక్రమాలు నిర్వహిస్తే అటు రాయలసీమలోనూ ఇటు ఉత్తరాంధ్రలోనూ అవును ప్రజలే తరిమి కొట్టే ప్రమాదం ఉందని టిడిపి నేతలు పసిగట్టారు. ఇదంతా తమకు ఎందుకొచ్చిన గొడవ అని అనుకున్నారో ఏమో చంద్రబాబు పిలుపును గాలికొదిలేసి టీడీపీ నేతలంతా ఇంటిపట్టునే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బాబు కు భంగపాటు!

author avatar
Yandamuri

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju