BBUtsavam : బీబీఉత్సవం.. BBUtsavam అంటే బిగ్ బాస్ ఉత్సవం అన్నమాట. ఈ సండే ఫుల్ టు ఫన్ డే కానుంది. దానికి కారణం.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు అంతా కలిసి చేసే సందడి ప్రసారం కానుంది. మరోసారి బిగ్ బాస్ షోను చూసినట్టే. బిగ్ బాస్ సండే ఎపిసోడ్ ఎంత ఫన్ డే గా ఉంటుందో అందరికీ తెలుసు. బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పుడు కేవలం సండే ఎపిసోడ్ కోసం చూసేవాళ్లు చాలామంది ఉంటారు. అలాగే.. ఇప్పుడు మళ్లీ అదే ఫన్ రాబోతోంది.
అదే బీబీ ఉత్సవం. బిగ్ బాస్ కంటెస్టెంట్ల గెట్ టుగెదర్. అందరూ బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ల కోసం స్టార్ మా కొత్త ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది. అదే ఇది. ఈ ప్రోగ్రామ్ ఈ సండే ప్రసారం కానుంది.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన పలు ప్రోమోలను విడుదల చేశారు. కానీ.. తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తే మాత్రం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే.
BBUtsavam : అరియానా, సోహెల్ ఈ షోకు హైలెట్
మామూలుగా సోహెల్ ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. తాజాగా.. బీబీఉత్సవంలో కూడా అదే జరిగింది. సోహెల్ సందడి మామూలుగా లేదు. మిగితా కంటెస్టెంట్లు కూడా ఎవరికి వారు బాగానే హడావుడి చేశారు. అందరూ ఒక చోట చేరి.. చేసిన హంగామా సూపర్బ్.
అయితే.. అరియానా, సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సోహెల్.. స్టేజ్ మీదికి రాగానే.. అరియానా అక్కడికి వెళ్లి.. సోహెల్ గుండె మీద చేయి వేస్తుంది. దీంతో.. ఏయ్.. ఏయ్.. చేయి తియ్.. అరె మెహబూబ్.. అఖిల్.. అంటూ సోహెల్ అరుస్తాడు. అయినప్పటికీ.. అరియానా మాత్రం అలాగే చేయి వేసి ఉంచి సోహెల్ ను టెంప్ట్ చేసింది. దీంతో స్టేజ్ మొత్తం నవ్వులే నవ్వులు. అమ్మో.. అరియానా చిన్నది కాదు.. అంతటి సోహెల్ నే డమాల్ న పడేసింది. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి.