వివాహం తో ఒక్కటిఅయిన జంట కలిసి జీవిత ప్రయాణం ప్రారంభిస్తారు. ఈ ప్రయాణానికి నమ్మకం, విశ్వాసం మొదటి అడుగులు కావలి.
ఎందుకంటే మీరు నమ్మే వ్యక్తిని ప్రేమించడం చాలా తేలిక.కానీ, నిజాయితీ లేని వివాహబందంలో భయం, అభద్రతా భావం సులువుగా ప్రవేశిస్తాయి.ఆ తర్వాత మీ దాంపత్య జీవితంలో చిన్న చిన్నఅబద్ధాలైన , దాచిపెట్టిన రహస్యలైనా మీకు మీ ఆనందాన్నీ దూరం చేస్తాయి . ఈ క్రమం లోనే మీ మద్య ఉన్న బంధం మొదట్లో ఉన్నంత ప్రేమగా రాను రాను ఉండదు . మగవాళ్ళు పెళ్లి కుదిరిన తర్వాత. కాబోయే భార్యతో షాపింగులు ,సినిమాలు ,షికారులు ,రెస్టరెంట్లు ఇలా ఎదో ఒక ప్రోగ్రాం తో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు . అయితే ఈ క్రమం లో జీవిత భాగస్వామిని మెప్పించేందుకు మగవాళ్ళు కొన్ని అబద్ధాలు చెబుతారన్నది మానసిక వైద్యులు అంటున్నారు . మరి ఆ అబద్ధాలు ఎలా ఉంటాయి ?అన్నది తెలుసుకుందాం . నేను ఇంతవరకూ ఒక్క అమ్మయిని కూడా చూడలేదని చెబుతుంటారు.నాకు కట్నాలు, కానుకలు వద్దు.ఒక్కజత బట్టలతో మా ఇంటికి వచ్చినా చాలని అంటారట.అలాగే, నీ వాళ్ళు నీకెంత ముఖ్యమో నాక్కూడా అంతే ,వారందరి బాధ్యతా నాపై కూడా ఉంటుంది.పెళ్లి తరువాత నిన్ను కష్టపెట్టనులే,నీ పనుల్లో నేను కూడాసహాయపడతా.నా కళ్ళతో చూడు.నువ్వు నా కంటికి ఎంత అందంగా కనిపిస్తున్నావో.నీతో పాటు తిరుగుతుంటే ఎంత బాగుందో..మరెవరితో వెళ్లినా ఇలా అనిపించదు.ఇలాంటి అబద్ధాలు మగవాళ్ళు ఎక్కువగా చెప్తూఉంటారు.అయితే ఇటువంటి మాటలు మస్సులో ఏ దురుద్దేశం లేకుండా చెప్పే అబద్ధాలేనని,వీటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు నిపుణులు.మరి ఇవన్నీ కాకపోయినా వీటిలో కొన్ని అయినా మీరు మీ లైఫ్ లో పేస్ చేసే ఉంటారు కదా…ఒక వేళ చేయకపోతే మీరు ఇంకా అదృష్టవంతులు.