బిగ్ బాస్ 4: సొహైల్ విషయంలో ఏడ్చేసిన అఖిల్..!!

బిగ్ బాస్ షో చాలా రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఎంటరైన సభ్యులలో బాగా కలిసిపోయి ఫ్రెండ్స్ గా ఈ సీజన్లో ఆడియన్స్ కి కనెక్ట్ అయిన వారిలో అఖిల్, సొహైళ్ ఒకరు. ఇంటిలో చాలా ఆవేశపరుడిగా పేరొందిన సోహెల్ విషయంలో… స్నేహితుడిగా అఖిల్ ఎప్పటికప్పుడు కూల్ చేస్తూ నిజమైన స్నేహితులు ఉండడం జరిగింది. కావాలని ఇతరులు సోహైల్ ని రెచ్చగొట్టినా గాని అఖిల్ మాత్రం… సోహైల్ ని రెచ్చిపోకుండా… కంట్రోల్ చేస్తూ వచ్చాడు.

అటువంటిది సోహెల్ తనని తప్పుపట్టడం తో అఖిల్ హౌస్ లో గట్టిగా అరిచి ఏడ్చేశాడు. అబద్ధం ఆడినట్టుగా సోహెల్ నీ అఖిల్ నామినేట్ చేయడంతో… ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది . ఈ విషయంలో సోహెల్ అఖిల్ ని నిలదీయడంతో నాకు అనిపించింది చెప్పాను…” నా గేమ్ నేనూ ఆడతాను” అని అఖిల్ తేల్చి చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ కొట్టుకునే దాకా వెళ్లడంతో… గట్టి గట్టిగా మాటలు అన్న అఖిల్ యే చివరాకరికి ఏడ్చేశాడు.

 

తర్వాత సోహెల్ కొంతసేపటికి వచ్చి అఖిల్ కన్నీరు తుడిచి దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. దీంతో మొత్తం మీద మొన్నటివరకు స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో… బిగ్ బాస్ ఆడియన్స్… రాబోయే రోజుల్లో వీరిద్దరికి టాస్క్ పడితే పరిస్థితి ఏంటి అన్న టెన్షన్ లో ఉన్నారు. మరోపక్క చాలామంది ఇంటిలో ఉన్న సభ్యులు ఈ విధంగానే మరి కొంత మంది జంటల పై తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది.