బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ఆదివారం అంగరంగ వైభవంగా జరగనుంది. టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్ లకు ఊహించని రీతిలో సపోర్ట్ వస్తుంది. అందరికంటే ఎక్కువగా అభిజిత్ అదేవిధంగా సోహెల్ కి ఓటింగ్ నువ్వానేనా అన్నట్టుగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో వాళ్ళిద్దరికీ పోటీ అరియనా కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రముఖులు తమ ఫేవరేట్ కంటెస్టెంట్ ని సపోర్ట్ చేయడం కోసం ఎవరికి వారు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు అభిజిత్ గెలిస్తే బాగుంటుందని వీడియోలు పెడుతున్నారు. అంత మాత్రమే కాక ఓటింగ్ పరంగా అభి గెలిచేసినట్లే అని మరికొంతమంది చెప్పుకొస్తున్నారు.
ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ త్రీ కంటెస్టెంట్ అలీ రెజా రంగంలోకి దిగి సోహెల్ ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా లో సంచలన పోస్ట్ పెట్టాడు. మేటర్ లోకి వెళ్తే ప్రతి ఒక్కరు సోహెల్ కి మద్దతుగా ఉండాలని కోరాడు. బిగ్ బాస్ హౌస్ లో నా దృష్టిలో నిజమైన విన్నర్ సోహైల్ అని పోస్ట్ పెట్టాడు. ఇదే క్రమంలో వేరే పోస్టులో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అసలు ఎవరు నమ్మవద్దు. ఓట్లు ఎవరికి పడుతున్నాయి అనే విషయం అధికారికంగా తెలియదు. అధికారికంగా వస్తున్న ఓట్ల గురించి ఎవరికి తెలియదు. కొందరు చేస్తున్న ప్రచారంను నమ్మి సోహెల్ కు ఓట్లు వేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు సోహెల్ ని సపోర్ట్ చేయాలని ఒకటికి రెండుసార్లు హాట్ స్టార్ లో మీరు వేసిన ఓట్లు నమోదు అయ్యాయో లేదో చెక్ చేసుకోండి, అంత మాత్రమే కాక ఓట్లు చీల్చి వేయకండి మిస్సేడ్ కాల్ ద్వారా కూడా మీ సపోర్ట్ తెలపండి అంటూ సోహెల్ కి అండగా ఉంటూ అలీ రెజా కీలక సమయంలో క్యాంపెయిన్ చేస్తున్నారు.