Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య Bigg boss Lasya గురించి తెలుసు కదా. తను ప్రస్తుతం పెద్ద సెలబ్రిటీ. బిగ్ బాస్ కంటే ముందు తను పెద్ద యాంకర్ కానీ.. తనకు అంతగా పేరు రాలేదు. కానీ.. ఎప్పుడైతే తనకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందో తన రేంజే మారిపోయింది.

బిగ్ బాస్ తర్వాత తనకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. బిగ్ బాస్ తర్వాత తన కెరీర్ మారిపోయింది. సెకండ్ కెరీర్ అద్భుతంగా స్టార్ట్ చేసింది లాస్య. యూట్యూబ్ చానెల్ కూడా స్టార్ట్ చేసి ఫుల్ టు బిజీ అయిపోయింది.
Bigg boss Lasya : బమ్ చిక్ బబ్లూ కోసం చికెన్ వండి పెట్టిన లాస్య
మీకు బమ్ చిక్ బబ్లూ తెలుసు కదా. ఆయన కూడా యూట్యూబ్ స్టారే. యూట్యూబ్ లో పలు ఫన్నీ వీడియోలు చేస్తుంటాడు. మనోడు.. లాస్య ఇంటికి వెళ్లి.. ఏదైనా చేసి పెట్టు అక్క.. ఆకలవుతోంది.. అని లాస్యను అడిగేసరికి.. లాస్య చికెన్ ఫ్రై చేసింది.
మొత్తానికి లాస్య.. చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసి బబ్లూకు పెట్టేసింది. ఇక.. బబ్లూ లొట్టలేసుకుంటూ తినేశాడు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లోనే కాదు.. తన ఇంటికి ఎవరైనా వస్తే తను ఎలా వండి పెడుతుందో మీరే చూడండి ఈ వీడియోలో.