Bigg boss Sujatha : బిగ్ బాస్ సుజాత గురించి తెలుసు కదా. బిగ్ బాస్ సుజాత కంటే ముందు తను జోర్దార్ సుజాతగా అందరికీ పరిచయం అయింది. హెచ్ఎంటీవీలో జోర్దార్ వార్తలతో తెలంగాణ యాసతో ఫేమస్ అయింది సుజాత. అందుకే తనను జోర్దార్ సుజాత అంటూ తెలంగాణ మొత్తం తనకు ఫిదా అయిపోయారు. తనకు ఫుల్ టు ఫాపులారిటీ వచ్చింది.

దీంతో తనకు బిగ్ బాస్ 4 లో మాటీవీ వాళ్లు అవకాశం ఇచ్చారు. అయితే… బిగ్ బాస్ లో తనకు అవకాశం వచ్చిందని… తను బిగ్ బాస్ కు వెళ్లేంతవరకు ఒక్క రోజు ముందే తన తల్లిదండ్రులకు తెలిసిందట. అప్పుడు అసలే కరోనా సమయం.. సుజాత హైదరాబాద్ లో ఉండటం… తన తల్లిదండ్రులు ఊళ్లో ఉండటం వల్ల… ఒక రోజు ముందే తను బిగ్ బాస్ హౌస్ కు వెళ్తున్నట్టు చెప్పిందట.
Bigg boss Sujatha : తన తండ్రికి బిగ్ బాస్ ముచ్చట్లు చెప్పిన సుజాత
తాజాగా బిగ్ బాస్ సుజాత.. తన తండ్రితో కాసేపు సరదాగా ముచ్చట్లు పెట్టింది. బిగ్ బాస్ లో తనకు ఎలా అవకాశం వచ్చింది. బిగ్ బాస్ లో ఏం చేసింది. అక్కడి పరిస్థితులు ఏంటి? తను ఎప్పుడు పెళ్లి చేసుకోబోతోంది. తనకు ఉన్న డ్రీమ్స్ ఏంటి? ఇలా… అన్ని ముచ్చట్లను తన తండ్రితో చెప్పుకొచ్చింది సుజాత.
దానికి సంబంధించిన వీడియోను తాజాగా తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది సుజాత. ఇంకెందుకు ఆలస్యం.. సూపర్ సుజాత వీడియోను వెంటనే చూసేయండి మరి.