ఈవారం ఇంటిలో ఆఖరి ఎలిమినేషన్ ప్రక్రియ జరగాల్సి ఉండగా అప్పుడే విచిత్ర పరిణామాలు చోటుచేసుకోవడం మొదలయ్యాయి. కంటెస్టెంట్స్ లో చాలామంది తమ కంట్రోల్ కోల్పోతున్నారు. ముఖ్యంగా టెంపర్ ఎక్కువైన సోహెల్, ఆరియానా మధ్య జరుగుతున్న గొడవ తారస్థాయికి చేరుతోంది. ఇద్దరూ పర్సనల్ గా తిట్టుకోవడం మొదలు పెట్టారు ఇది వినోదంతోపాటు చిరాకు కూడా తెప్పిస్తుండడం గమనార్హం.
అయితే కొంతమంది సోహెల్ కు సపోర్ట్ చేస్తూ ఉంటే మరికొంతమంది ఆరియానా వైపు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఆ వాదనలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఈ గొడవ విషయానికి వస్తే ఈ ఒక్క విషయంలో మాత్రం సొహెల్ కు పూర్తి వ్యతిరేకత వస్తోంది. ఆరియానా తను ముద్దుగా పెంచుకున్న బొమ్మను సోహెల్ అవమానించడం ఆ బొమ్మతో ఆమెకు ఉన్న అనుబంధాన్ని కించపరచడం చూసి తట్టుకోలేకపోయింది. అయితే అతనిని రెచ్చగొడుతూ పక్కనే తిరుగుతున్నప్పుడు సోహెల్ నువ్వు మనుషులకి మర్యాదగా ఇవ్వు తర్వాత బొమ్మల గురించి ఆలోచించవచ్చు అని అన్నాడు.
అప్పుడు అవినాష్ టాపిక్ ఎత్తిన సోహెల్ నీకు జ్వరం వచ్చినప్పుడు అవినాష్ చూసుకున్నాడు… చింటూ కాదు నిన్ను అంత బాగా ఇష్టపడిన అవినాష్ ను నువ్వు ఏడిపించావు నీ చింటూ కోసం బెస్ట్ ఫ్రెండ్ ను ఏడిపించావు నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు అని అన్నాడు.
ఇక ఆ మాటలతో ఆరియానా పూర్తిగా రెచ్చిపోయింది. అక్కడి నుండి వారిద్దరి మధ్య గొడవ చాలా ఎక్కువ అయిపోయింది. అయితే ఇంటిలో లేని అవినాష్ మ్యాటర్ తీసుకురావడం ఎంతవరకు సబబు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏమైనా ఉంటే ఆమెను నేరుగా అడగాలి కానీ అవినాష్ ను తీసుకుని వచ్చి అనడం కరెక్ట్ కాదు అని చెబుతున్నారు.